
మునిగిపోవడం కల్ల!
ఈ కుర్రాడు వేసుకున్న టీషర్ట్‌ను జాగ్రత్తగా గమనించండి. ఏదైనా తేడా కనిపిస్తోందా? లేదుకదూ... కానీ ఛాతీకి ఇరువైపులా భుజాలకు దగ్గరగా రెండు ఆకారాలున్నాయి చూశారా? అవే ఈ టీషర్ట్ స్పెషాలిటీ. ఎడమవైపున లంగరు ఆకారంలో ఉన్న దాన్ని గట్టిగా కిందకు లాగారనుకోండి. మహాసముద్రం లోనూ మీరు కించిత్ కూడా మునగకుండా తేలియాడుతారు. టీషర్ట్ వెనుకభాగంలో ఉండే ప్రత్యేకమైన ట్యూబ్‌లోకి గాలి ప్రవేశించి మిమ్మల్ని నీటిపైనే ఉంచుతుంది. ఈత నేర్చుకునే వారికి, వాటర్‌స్పోర్ట్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏజీస్ లైఫ్‌షర్ట్ పేరుతో దీన్ని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.