ఉంగరం వేలికి మచ్చ... | Ring finger to the spot | Sakshi
Sakshi News home page

ఉంగరం వేలికి మచ్చ...

Published Mon, Mar 30 2015 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

ఉంగరం  వేలికి  మచ్చ...

ఉంగరం వేలికి మచ్చ...

అందం
 
వేలికి ఉంగరం చేతికి ఎంతో అందాన్నిస్తుంది. అయితే, ఆ వేలి చుట్టూ నల్లని వలయం ఏర్పడితే మాత్రం ఆ అందం ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు. వేలిపై ఉంగరం స్థానంలో ఏర్పడిన మచ్చలను తొలగించాలంటే కొన్ని రోజుల పాటు ఉంగరాన్ని ధరించకుండా ఉండటం తాతాల్కిక పరిష్కారం మాత్రమే. మళ్లీ ఉంగరం ధరించినప్పుడు, మళ్లీ మచ్చ రావడం ఖాయమే కదా! ఈసారి సమస్య తిరిగి రాకుండా..

  ఎండ వల్ల లోహం వేడెక్కి, ఉంగరం వుండే ప్రాంతంలో చర్మం మరింత నలుపుగా మారే అవకాశం ఉంది. అంత మాత్రాన ఆ ప్రాంతంలో సన్‌స్క్రీన్ లోషన్ రాయడం అనవసరం.

టీ స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి, నల్లని వలయం చుట్టూ రాసి, 15 నిమిషాలు ఉంచండి. ఆరిన తర్వాత కడిగేయండి. వారానికి మూడు రోజులు ఇలా చేస్తూ ఉండండి. ట్యాన్ (ఎండకు కమలడం) వల్ల ఏర్పడిన మచ్చ చర్మం రంగుకు మారుతుంది.  కొద్దిగా మాయిశ్చరైజర్ అద్దుకుని, వేళ్లపై రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజితం అయి, ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.

  నెల రోజులకు ఒకసారి వేళ్లకు, గోళ్లకు తప్పనిసరిగా పార్లర్‌లో లేదా ఇంట్లో మేనిక్యూర్ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, అందులో 15 నిమిషాలు వేళ్లను ముంచి ఉంచి, తర్వాత మృతకణాలను తొలగించడానికి స్క్రబ్‌తో రుద్దాలి. ఈ పద్ధతి వల్ల ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement