Scar
-
నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ..
రోజూ మాదిరిగానే ఆమె తన అత్యవసర పనుల కోసం బయటకు వచ్చింది. నగరంలోని రోడ్లు బిజీగా ఉన్నాయి. ఎంతో కష్టమీద ఆమెకు ఆటో దొరికింది. ఆమె ఆటోలో కూర్చుంది. ట్రాఫిక్ అధికంగా ఉన్న కారణంగా ఆటో మెల్లగా ముందుకు కదులుతోంది. ఇంతలో ఆమెకు రోడ్డుపై కాషాయవస్త్రాలు ధరించిన ఇద్దరు సాధువులు కనిపించారు. వారిద్దరూ ఆమె ప్రయాణిస్తున్న ఆటో దగ్గరకు వచ్చి.. ‘అమ్మా దానం చేయండి.. మీకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. ఆమె ఆ సాధువులను చూసి, తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి, కొంత డబ్బు ఇవ్వాలనుకుంది. అయితే ఇంతలో వారు తమ దగ్గరున్న జోలెలో నుంచి ఒక పామును బయటకు తీశారు. ఆ పామును ఆ మహిళ ముఖం దగ్గరకు తీసుకువచ్చారు. పామును చూడగానే ఆమె హడలెత్తిపోయింది. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీనిని గమనించిన ఆ సాధువులు ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు. దానిలో రూ. 2000 ఉన్నాయి. ‘భగవంతుడు మీకు మేలు చేస్తాడు’ అంటూ ఆ బ్యాగుతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తరహా మోసాలకు పాల్పడే గ్యాంగ్ ఢిల్లీలో ఉంటూ గురుగ్రామ్‌లో జనాలను లూటీ చేస్తోంది. ఈ గ్యాంగ్‌లోని వ్యక్తులు సాధువుల వేషం ధరించి, జనానికి ఉండే భక్తి సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. బైక్, కారు, బస్సులలో ప్రయాణిస్తున్నవారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంటోంది. వీరు ముందుగా జనాలను డబ్బులు అడుగుతారు. ఎదుటివారు పర్సు తీయగానే వారిపైకి పామును వదులుతారు. వారు భయపడగానే వారి దగ్గరున్న సొమ్ము లాక్కుని పాముతో సహా పారిపోతుంటారు. కొద్ది రోజుల క్రితం గుర్గ్రామ్కుచెందిన రాధావాణి అనే మహిళ తనకు జరిగిన ఈ విధమైన మోసం గురించి సెక్టార్-52 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాబాల వేషంలో తన దగ్గర నుంచి రూ.2000 లాక్కున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ మోసగాళ్లను పట్టుకున్నారు. ఇది కూడా చదవండి: చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో! -
ముఖమంతా మొటిమలు, బయటకు వెళ్లలేకపోతున్నా.. ఏం చేయాలి?
‘బేబీ... పొద్దున లేచిందగ్గర్నుంచీ అద్దం ముందేనా? త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లు’ అని అరిచింది అరవింద. ‘వెళ్తాలేమ్మా’ అని సమాధానమిచ్చింది మానవి. కానీ అద్దం ముందు నుంచి కదల్లేదు. తన మొహంపై మొటిమలు అసహ్యంగా ఉన్నాయని బాధపడుతూ కూర్చుంది. ‘బేబీ... కాలేజీ బస్ వచ్చిందమ్మా’ అని కేకేశాడు ఆనంద్. ‘వస్తున్నా డాడీ... కాస్త ఆగమని చెప్పు’ అని హడావుడిగా తయారై బస్సెక్కింది. ∙∙ ‘హాయ్... బేబీ’ అని పలకరించింది అర్పిత. ‘హాయ్.. అర్పీ’ ‘హేయ్... కరోనా పొయ్యి ఏడాదైందే. ఇంకా ఆ మాస్క్ ఏంటే బాబూ?’ ‘ఏం చెప్పమంటావే... మొహమంతా పింపుల్స్. ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా తగ్గడంలేదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్ కూడా వాడా. అయినా నో రిలీఫ్.’ ‘హ్మ్... వాటి గురించి అంత ఆలోచనెందుకే బాబూ! ఆ పింపుల్స్‌తో నువ్వు సాయిపల్లవిలా కనిపిస్తున్నావ్ తెలుసా?’ ‘నా మొహంలే’ అని బలవంతంగా నవ్వింది మానవి. క్లాసులో కూర్చుందన్న మాటే కాని మనసంతా పింపుల్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటివల్లనే తాను అందంగా కనిపించడంలేదని, వాటివల్లనే తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటోంది. ఎలాగోలా క్లాసులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది. ‘బేబీ.. త్వరగా స్నాక్స్ తిని రెడీ అవ్వు. మావయ్య వాళ్లింట్లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం’ అని చెప్పింది అరవింద. ‘నువ్వెళ్లు మమ్మీ... నేను రాను.’‘అదేంటే.. అన్నిటికీ, నేను రాను, నేను రాను అంటావ్. నువ్వు రాకపోతే మావయ్య ఫీలవుతాడు. మీ అత్త నిష్టూరమాడుతుంది.’ ‘వాళ్లతో నేను ఫోన్లో మాట్లాడతాలే, నువ్వెళ్లు.’‘ఏవిటో ఇది.. ఎక్కడికీ రానంటుంది’ అనుకుంటూ వెళ్లింది అరవింద. ∙∙ పింపుల్స్ సమస్య చిన్నదే. టీనేజ్‌లో చాలామంది అనుభవించేదే. కానీ మానవికి మాత్రం అదో పే...ద్ద సమస్యగా మారింది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయాయి. నిత్యం ఆందోళనగా ఉంటోంది. దాన్ని అధిగమేంచేందుకు విపరీతంగా తింటోంది. దానివల్ల బరువు పెరుగుతోంది. దానివల్ల మళ్లీ ఆందోళన. ఇదో అందులేని నెగెటివ్ సైకిల్‌గా మారిపోయింది. పలకరిస్తే ఏడుస్తోంది. దీనికేదో అయ్యిందని అరవింద.. మానవిని కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు. లేని సమస్య గురించే ఆలోచనలు మానవితో అరగంట మాట్లాడేసరికి... ఆమె మనసంతా మొటిమలపైనే ఉందని అర్థమైంది. మానవికి ఉన్న సమస్యను బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ) అంటారు. అంటే శరీరంలో ఇతరులకు కనిపించని లోపం ఉందని భావిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉండటం. ఇదో రకమైన మానసిక రుగ్మత. ఓసీడీలో ఇదో రకం. మానవి మొటిమల గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ముక్కు గురించి లేదా రంగు గురించి లేదా బరువు గురించి లేదా ముడతల గురించి లేదా వక్షస్థలం కొలత గురించి ఆలోచించవచ్చు. టీనేజ్ కుర్రాళ్లు జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం లేదా కండలు లేకపోవడం గురించి బాధపడుతూ ఉండవచ్చు. ఈ ఆలోచనలను నియంత్రించడం కష్టం. కారణాలు అనేకం... బీడీడీ ఎలా, ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. జెనెటిక్స్ నుంచి కల్చర్, మీడియా వరకూ రకరకాల కారకాలు ఉంటాయి. బీడీడీ ఉన్న కుటుంబ సభ్యులుంటే ఇది వచ్చే అవకాశం మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కల్చర్, మీడియా, మూవీస్ కలిసి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. బాల్యంలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదా బెదిరించడం లేదా ఆటపట్టించడం లాంటివి కూడా కారణం కావచ్చు. బీడీడీ సంకేతాలు, లక్షణాలు ►ఇతరులకు కనిపించని లేదా మైనర్‌గా అనిపించే లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం .మీ రూపాన్ని అగ్లీగా మార్చే లోపం ఉందని బలమైన నమ్మకం ►మీ రూపాన్ని ఇతరులు ఎగతాళి చేస్తారనే నమ్మకం. ►తరచూ అద్దంలో చూసుకోవడం ∙స్టైలింగ్, మేకప్ లేదా దుస్తులతో లేని లోపాలను దాచడానికి ప్రయత్నించడం ►మీ రూపాన్ని నిరంతరం ఇతరులతో పోల్చడం ∙లోపాన్ని సరిదిద్దుకునేందుకు విస్తృతంగా కాస్మెటిక్స్ వాడటం ∙మీలో లోపం ఉందని, ఫంక్షన్స్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం. సైకోథెరపీతో చెక్ పెట్టొచ్చు మొదటి సెషన్లో సైకో డయాగ్నసిస్ ద్వారా మానవి సమస్యను నిర్ధారణయ్యాక, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స ప్రారంభించాను. ప్రతికూల ఆలోచనలు, ఎమోషనల్ రియాక్షన్స్, ప్రవర్తనలు సమస్యకు ఎలా కారణమవుతాయో తెలుసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పింపుల్స్ గురించి ఉన్న ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సరైన ఆలోచనా విధానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. తరచూ అద్దం చూసుకోవడం, కాస్మెటిక్స్ తగ్గించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. అలా పది సెషన్లలో మానవి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాను మొటిమల సమస్యను పక్కకు నెట్టేసి, కాన్ఫిడెంట్‌గా అన్ని ఫంక్షన్స్‌కు హాజరవుతోంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
మొటిమలు, మచ్చల నివారణ.. ఈ ప్యాక్స్ ప్రయత్నించండి
బీట్రూట్ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి. బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!) -
సల్వార్ కట్టే చోట నల్లటి మచ్చ...
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి. – సుష్మా, హైదరాబాద్ మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... ∙నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి ∙నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీమ్ రాసుకోండి ∙బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి ∙అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ బయటి జుట్టు చివర్లు చిట్లుతున్నాయి...! నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా మీడియమ్ లెంత్ హెయిర్‌లోని హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్పోజ్ అవుతోంది. దాంతో ఆ భాగం జుట్టులోని చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. తగిన పరిష్కారం చెప్పండి. – కె. శివానీ, విశాఖపట్నం మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ∙టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి. ∙రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి ∙తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... ∙డైమిథికోన్ ∙ట్రైజిలోగ్జేన్ ∙విటమిన్ ఈ ఎసిటేట్ ∙అహోబా ఆయిల్ ∙ఆలివ్ ఆయిల్ ∙ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. కాలి వేళ్ల మధ్య ఎర్రబారుతోంది... నా వయసు 54 ఏళ్లు. గృహిణిని. మా ఇంట్లో మా ప్లేట్లు నేనే శుభ్రం చేస్తేగానీ లేదా మా బట్టలు నేనే ఉతుక్కుంటేగానీ నాకు సంతృప్తి ఉండదు. అందుకే ఆ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను. దాంతో తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – అనసూర్య, కోదాడ మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బు నీళ్లలో కాళ్లు తడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. అలర్జిక్ ర్యాష్ వచ్చిన చోట డార్క్ మార్క్స్... నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్క్స్ ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పారిజాత, ఒంగోలు మీరు ‘పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి. ∙ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి. ∙కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు రాయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
మచ్చతో తొందరగా కేన్సర్ గుర్తింపు
ప్రాణాంతకమైన కేన్సర్‌ను వీలైనంత తొందరగా గుర్తిస్తే చికిత్స కల్పించడం సులభం. ఈ విషయం అందరికీ తెలుసుగానీ.. తొందరగా గుర్తించడమెలా? అన్న విషయంలోనే ఇబ్బందులున్నాయి. ఈ అడ్డంకిని అధిగమించేందుకు స్విట్జర్లాండ్‌లోని ఈటీహచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. శరీరంలోకి ఓ చిన్న గాడ్జెట్‌ను జొప్పిస్తారు, అది రక్తంలోని క్యాల్షియం మోతాదులను గుర్తిస్తూంటుంది. రక్తంలో క్యాల్షియం ఎక్కువగా ఉండటమన్నది దాదాపు నాలుగు రకాల కేన్సర్లకు సూచిక అని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో క్యాల్షియం ఉండటంతోపాటు, అవే మోతాదులు దీర్ఘకాలంపాటు కొనసాగితే కేన్సర్ సోకినట్లుగా భావించాల్సి వస్తుంది. పరీక్షల ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించుకుంటే చికిత్స మెరుగ్గా ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా గాడ్జెట్ ఉన్న ప్రాంతంలో చర్మంపై కృత్రిమంగా ఒక మచ్చ ఏర్పడుతుంది. క్యాల్షియం పెరిగినకొద్దీ ఈ మచ్చ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. క్యాల్షియం మోతాదులకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్ కొన్ని జన్యుమార్పిడి కణాల సాయంతో మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఇది కాస్తా నల్లటి మచ్చగా మారుతుంది. సాధారణ పరీక్షల ద్వారా గుర్తించే సమయానికి చాలాకాలం ముందే ఈ గాడ్జెట్ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్ ఫుసెనిగ్గర్ అంటున్నారు. ఎలుకల్లో ఈ గాడ్జెట్‌ను పరీక్షించి సత్ఫలితాలు సాధించామని తెలిపారు. అయితే ఈ గాడ్జెట్‌లో ఉండే జన్యుమార్పిడి కణాలు ఏడాది కాలం పాటు మాత్రమే పనిచేస్తాయని, ఆ తరువాత వాటిని మళ్లీ కొత్తవాటితో మార్చుకోవాల్సి ఉంటుందని మార్టిన్ తెలిపారు. -
మచ్చలకి ఆవిరి పెట్టండి!
బ్యూటిప్స్ అసలే ఇది ఎండాకాలం. కాసేపలా బయటకి వెళ్లి వచ్చారంటే, ముఖం నల్లగా జిడ్డోడటమే గాక మచ్చలు కూడా పడటం సహజం. చర్మం నిర్జీవంగా మారిపోతుంది. అలాంటప్పుడు ఏదయినా క్రీమును ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఆవిరిపడితే సరి. క్రమేణా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవడానికి ఆవిరిస్నానం... అదేనండీ, స్టీమ్‌బాత్ ఎంతో ఉపకరిస్తుంది. స్టీమ్‌బాత్ అందుబాటులో లేకపోతే కనీసం ముఖానికి ఆవిరి పట్టించినా మేలే. ఎందుకంటే ఆవిరి పట్టడం ద్వారా ముఖచర్మంలోని రక్తకణాలు ఉత్తేజితమై, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మూసుకు పోయి ఉన్న స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. అయితే బాగా మసిలే నీటితో ఆవిరి పెట్టకూడదు. అలా చేయడం వల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. తగుమాత్రం వేడి ఉంటే చాలు. ముఖం మీద మొటిమలు బాగా ఉన్నవాళ్లు కూడా ఆవిరికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. -
ఉంగరం వేలికి మచ్చ...
అందం వేలికి ఉంగరం చేతికి ఎంతో అందాన్నిస్తుంది. అయితే, ఆ వేలి చుట్టూ నల్లని వలయం ఏర్పడితే మాత్రం ఆ అందం ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు. వేలిపై ఉంగరం స్థానంలో ఏర్పడిన మచ్చలను తొలగించాలంటే కొన్ని రోజుల పాటు ఉంగరాన్ని ధరించకుండా ఉండటం తాతాల్కిక పరిష్కారం మాత్రమే. మళ్లీ ఉంగరం ధరించినప్పుడు, మళ్లీ మచ్చ రావడం ఖాయమే కదా! ఈసారి సమస్య తిరిగి రాకుండా.. ఎండ వల్ల లోహం వేడెక్కి, ఉంగరం వుండే ప్రాంతంలో చర్మం మరింత నలుపుగా మారే అవకాశం ఉంది. అంత మాత్రాన ఆ ప్రాంతంలో సన్‌స్క్రీన్ లోషన్ రాయడం అనవసరం. టీ స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి, నల్లని వలయం చుట్టూ రాసి, 15 నిమిషాలు ఉంచండి. ఆరిన తర్వాత కడిగేయండి. వారానికి మూడు రోజులు ఇలా చేస్తూ ఉండండి. ట్యాన్ (ఎండకు కమలడం) వల్ల ఏర్పడిన మచ్చ చర్మం రంగుకు మారుతుంది. కొద్దిగా మాయిశ్చరైజర్ అద్దుకుని, వేళ్లపై రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజితం అయి, ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి. నెల రోజులకు ఒకసారి వేళ్లకు, గోళ్లకు తప్పనిసరిగా పార్లర్లో లేదా ఇంట్లో మేనిక్యూర్ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, అందులో 15 నిమిషాలు వేళ్లను ముంచి ఉంచి, తర్వాత మృతకణాలను తొలగించడానికి స్క్రబ్‌తో రుద్దాలి. ఈ పద్ధతి వల్ల ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.