Sunscreen lotion
-
బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్‌ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడండి సమ్మర్ లో మీ చర్మం మెరిసిపోతుంది
-
సన్‌స్క్రీన్ లోషన్లతో నపుంసకత్వం..!
లండన్: సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల బారి నుంచి తప్పించుకునేందుకు ఎడాపెడా సన్‌స్క్రీన్ లోషన్లను దట్టించే పురుషులకో హెచ్చరిక. అలాగే, మేకప్ సామగ్రిని, మాయిశ్చరైజర్లను, లిప్‌బామ్‌లను అతిగా వాడేవాళ్లకు కూడా..! అతినీలలోహిత కిరణాలను ఫిల్టర్ చేసే కొన్ని రసాయనాల వల్ల నపుంసకత్వ ప్రమాదముందని తాజాగా తేలింది. వీర్య కణాల నాణ్యతపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని, మహిళల హార్మోన్ ప్రొజెస్టిరాన్ తరహాలో పనిచేసి, వ్యంధ్యత్వానికి దారి తీస్తాయని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్ యూనివర్సిటీలో జరిపిన పరిశోధనల్లో తేలింది. -
ఎండల్లో హెయిర్‌కేర్
ఎండకాలంలో చర్మసంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కేశసంరక్షణకు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం శ్రద్ధపెడితే తీవ్రమైన ఎండల్లోనూ అలల్లా ఎగిసిపడే కేశాలు సాధ్యమే. * ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి రాసినట్లే జుట్టుకు లేదా మాడుకు కొంచెం సన్‌స్క్రీన్ లోషన్ అప్లయ్ చేయాలి. ఈ లోషన్లు రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లేదా రాత్రి పడుకునే లోపుగా తలస్నానం చేయాలి. అలా సాధ్యం కానప్పుడు లోషన్లకు బదులుగా మాడుకు కొబ్బరినూనె రాయాలి. * ఈ కాలంలో స్విమ్మింగ్‌పూల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. ఈతప్రియులు ఎండవేడి నుంచి సాంత్వన పొందడానికి ఎక్కువ సేపు నీటిలో ఉండడానికి ఇష్టపడతారు. అయితే స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉండే నీటిలో క్లోరిన్ కలుపుతారు, ఉప్పునీరు కూడా ఉంటుంది. కాబట్టి పూల్‌లో దిగే ముందు తలను మంచినీటితో తడపాలి. జుట్టు తగినంత నీటిని పీల్చుకున్న తర్వాత ఎంత సేపు పూల్‌లో ఉన్నా ఆ నీటిని పీల్చుకోదు. కాబట్టి అందులోని రసాయనాల ప్రభావం జుట్టుపై పడదు. స్విమ్మింగ్ పూర్తయిన తర్వాత తప్పని సరిగా తలస్నానం చేయాలి. * తలస్నానం పూర్తయిన తర్వాత కండిషనర్ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. సమ్మర్ కోసం ప్రత్యేకంగా సన్‌స్క్రీన్ ఉన్న హెయిర్ కండిషనర్లు మార్కెట్లో దొరుకుతాయి. * తలస్నానం చేసేటప్పుడు చివరగా నిమ్మరసం కలిపిన నీటితో జుట్టును తడపాలి. ఇలా చేయడం వల్ల కేశాలు దృఢంగా మారతాయి. కాని ఎండకాలంలో పొడిజుట్టుకు నిమ్మరసం వాడితే మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిజుట్టుకు కాఫీ డికాషన్ వంటి కండిషనర్లను వాడడం మంచిది. * మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్‌సైడర్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు ఉంటే ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు కూడా పట్టించాలి. -
ఉంగరం వేలికి మచ్చ...
అందం వేలికి ఉంగరం చేతికి ఎంతో అందాన్నిస్తుంది. అయితే, ఆ వేలి చుట్టూ నల్లని వలయం ఏర్పడితే మాత్రం ఆ అందం ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు. వేలిపై ఉంగరం స్థానంలో ఏర్పడిన మచ్చలను తొలగించాలంటే కొన్ని రోజుల పాటు ఉంగరాన్ని ధరించకుండా ఉండటం తాతాల్కిక పరిష్కారం మాత్రమే. మళ్లీ ఉంగరం ధరించినప్పుడు, మళ్లీ మచ్చ రావడం ఖాయమే కదా! ఈసారి సమస్య తిరిగి రాకుండా.. ఎండ వల్ల లోహం వేడెక్కి, ఉంగరం వుండే ప్రాంతంలో చర్మం మరింత నలుపుగా మారే అవకాశం ఉంది. అంత మాత్రాన ఆ ప్రాంతంలో సన్‌స్క్రీన్ లోషన్ రాయడం అనవసరం. టీ స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి, నల్లని వలయం చుట్టూ రాసి, 15 నిమిషాలు ఉంచండి. ఆరిన తర్వాత కడిగేయండి. వారానికి మూడు రోజులు ఇలా చేస్తూ ఉండండి. ట్యాన్ (ఎండకు కమలడం) వల్ల ఏర్పడిన మచ్చ చర్మం రంగుకు మారుతుంది. కొద్దిగా మాయిశ్చరైజర్ అద్దుకుని, వేళ్లపై రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజితం అయి, ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి. నెల రోజులకు ఒకసారి వేళ్లకు, గోళ్లకు తప్పనిసరిగా పార్లర్లో లేదా ఇంట్లో మేనిక్యూర్ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, అందులో 15 నిమిషాలు వేళ్లను ముంచి ఉంచి, తర్వాత మృతకణాలను తొలగించడానికి స్క్రబ్‌తో రుద్దాలి. ఈ పద్ధతి వల్ల ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి. -
ఎండ కూడా మంచిదే!
రెట్టింపు నీళ్లు శ్రేయస్కరం... చలికాలం, వర్షాకాలం రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. అదే వేసవి కాలంలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలి. అప్పుడే చర్మం తన సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగలేం అనుకునేవారు మజ్జిగ, పండ్ల రసాల రూపంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు. పదే పదే సబ్బు వాడకం వద్దు... వేసవిలో పదే పదే ముఖాన్ని, చేతులను చల్లని నీటితో కడుక్కోవాలనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు పదే పదే సబ్బును ఉపయోగించడం వల్ల స్వేదరంధ్రాలలో ఉండే సహజసిద్ధమైన నూనె తొలగిపోతుంది. చర్మం తిరిగి నూనెను ఉత్పత్తి చేయడానికి తీసుకునే సమయం పెరుగుతుంది. లేదంటే కొన్ని నూనె గ్రంధులు నూనెను ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. దుమ్ము, ధూళి కణాలు ఆ నూనెపై చేరి, మొటిమలకు కారణం అవుతాయి. కాబట్టి రోజుకు రెండు సార్లు మాత్రం ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బుకు బదులు ఫేస్‌వాష్‌ను ఉపయోగించాలి. మిగతా సమయాల్లో చల్లని నీటితో మాత్రమే ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వేసవిలో ఎండ వల్ల త్వరగా నీరసించిపోతామని భయపడతామే తప్ప ఈ కాలం కలిగించే ప్రయోజనాలను పట్టించుకోం. ఎండ వల్ల శరీరానికి తగినంత ‘డి’ విటమిన్ లభిస్తుంది. మిగతా కాలాల్లో నిస్తేజంగా ఉన్న చర్మం కూడా ఈ కాలం కాంతిమంతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు యవ్వనవంతమైన చర్మాన్ని ఈ కాలం సులువుగా పొందవచ్చు. సన్‌స్క్రీన్ లోషన్ తప్పని సరి... ఎండకాలం బయటకు వెళితే సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి నేరుగా తగులుతాయి. ఫలితంగా చర్మం కములుతుంది. దీని వల్ల చర్మ సౌందర్యమే కాదు ఆరోగ్యమూ దెబ్బతింటుంది. అందుకని సూర్యకాంతికి -చర్మానికి మధ్య అడ్డుతెరలా ఎస్.పి.ఎఫ్ 30 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ని తప్పనిసరిగా ఉపయోగించాలి. బయటకు వెళ్లడానికి పది-పదిహేను నిమిషాల ముందు ఈ లోషన్ రాసుకోవాలి. స్క్రబ్బింగ్ మంచిదే! వేసవిలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం. స్వేదరంధ్రాలలో మురికి, అధిక జిడ్డు. స్వేదరంధ్రాలలోని మురికి, జిడ్డు తొలగించకపోతే బ్యాక్టీరియా చేరి మొటిమలు, యాక్నె, బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. మచ్చలేని చర్మకాంతి సొంతమవ్వాలంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు ఇంట్లోనే చేసుకోదగిన స్క్రబ్బింగ్ పద్ధతులు మేలైనవి. సన్నని గోధుమ పొట్టు, పసుపు, పాలు స్క్రబ్‌కి మేలైన సాధనాలు. వీటిని కలిపి, ముఖానికి రాసి, మృదువుగా వలయాకారంగా రుద్దుతూ... పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందుతారు. మేకప్ తొలగింపు తప్పనిసరి...: రాత్రి నిద్రించడానికి ముందు తప్పని సరిగా మేకప్ తొలగించాలి. లేకుంటే స్వేదరంధ్రాలు మూసుకుపోయి, మొటిమలు రావడానికి కారణం అవుతుంది. చర్మకాంతీ తగ్గుతుంది. అందుకని తప్పనిసరిగా మేకప్ తీసివేసి, మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్స్ రాసుకోని పడుకోవాలి. వాటర్‌ప్రూఫ్ సౌందర్యం... చలికాలం, వర్షాకాలం ఉపయోగిం చిన సౌందర్య ఉత్పత్తులనే ఈ కాలమూ ఉపయోగించడం చర్మానికి మంచిది కావు. అందుకని ‘ఆయిల్ ఫ్రీ’వి అందులోనూ ఎస్.పి.ఎఫ్ శాతం ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఎక్కువ ఫౌండేషన్ వాడకం వల్ల చర్మం త్వరగా నల్లగా కనిపిస్తుంది. అందుకని లిప్‌గ్లాస్, వాటర్‌ప్రూఫ్ ఐ లైనర్, మస్కారా ఉపయోగిస్తే చాలు ముఖారవిందం అందంగా కనిపిస్తుంది. చర్మం కాంతిమంతంగా కనిపించాలని క్రీమ్ ఫౌండేషన్లూ ఈ కాలం వాడకపోవ డమే మేలు. తప్పనిసరి మేకప్ ఉత్పత్తులను వాడేటట్ల యితే వాటర్‌ప్రూఫ్ సౌందర్య ఉత్పత్తులను ఉపయో గించడం మేలు. కేశసంపదకు షాంపూ... శరీరంలో శిరోజాలదీ ప్రత్యేకమైన స్థానమే. వెంట్రుక చిట్లడం, పొడిబారడం ఈ కాలం వేధించే ప్రధాన సమస్యలు. కురుల సంరక్షణకు ఉపయోగించే షాంపూ వంటి ఉత్పత్తుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఉత్పత్తులలో సల్ఫేట్ లేనివి ఎంచుకోవడం శ్రేయస్కరం. మాయిశ్చరైజర్ తప్పనిసరి... చర్మం ఎక్కువ జిడ్డు ఉండకూడదు. అలాగని వాతావరణ మార్పుల వల్ల పొడిబారకూడదు. దీనికి సరైన సమాధానం మాయిశ్చరైజర్‌తో మసాజ్. ముఖం, చేతులు కడుకున్న ప్రతీసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పడుకోవడానికి ముందూ పాదాలు, చేతులు, ముఖానికి తప్పనిసరి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ జాగ్రత్త వల్ల చర్మ కాంతి ఏమాత్రం తగ్గదు.