పార్లర్‌కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని
Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA
— Godman Chikna (@Madan_Chikna) September 15, 2023
Comments
Please login to add a commentAdd a comment