అదితి శంకర్.. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెండిటీ ఆమెది. నటనపై నాకున్న ఆసక్తిని నాన్నకు చెప్పినప్పుడు, ఆయన నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు.. ఏడాదిలోపు అవకాశం వస్తే ఒకే.. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని చెప్పారు. ఆ కండిషన్‌కు ఎస్ చెప్పే ప్రయత్నించాను.. సాధించాను అంటోంది అదితి శంకర్. ఇక డాక్టర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రత్యేకతతో మ్యాచ్ అవడానికి పోటీ పడుతోన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి..
రుబీనా
రుబీనా అఫ్రోజ్.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి సొంతంగా తన పేరుమీద చెన్నైలో ‘రుబీనా వోగ్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా కొత్తతరం డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్ డిజైన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే దీని బ్రాండ్ వాల్యూ. వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలు ఉంది. అదితి ధరించిన రుబీనా వోగ్ చీర ధర రూ. 8,500
జేసీఎస్..
జ్యూయల్ క్రియేషన్స్.. పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్‌ను అందించే స్టోర్. 2013లో అరవింద్ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తోంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. సింపుల్ డిజైన్స్‌తో గ్రాండ్ లుక్‌నిచ్చే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment