ఈశారీ పార్టీకే! | New year What should be new | Sakshi
Sakshi News home page

ఈశారీ పార్టీకే!

Published Fri, Dec 28 2018 1:38 AM | Last Updated on Fri, Dec 28 2018 1:38 AM

New year What should be new - Sakshi

ఇప్పటివరకు వెస్ట్రన్‌ పార్టీలకు ..ప్యాంట్లేశాం .. చొక్కాలేశాంటైట్స్‌ వేశాం.. లూజ్‌ వేశాంషార్ట్‌ వేశాం.. లాంగ్‌ వేశాంరైట్‌ వేశాం.. రాంగ్‌ వేశాంకానీ, కొత్త సంవత్సరం కొత్తగా ఏం వెయ్యాలి?!ఈసారి పార్టీకి సంప్రదాయాన్నే కొత్తగా కట్టాలి.హ్యాపీ న్యూ శారీ.
 

►మిడ్‌స్లీవ్స్‌ బ్లౌజ్‌తో శారీ గౌన్‌ ధరిస్తే పార్టీకి వెస్ట్రన్‌ లుక్‌ వచ్చేసినట్టే. ఈ స్టైల్‌ ఎప్పుడూ పార్టీలో ఎవర్‌గ్రీన్‌ కాంబినేషన్‌. ఇతరత్రా ఆభరణాలు అవసరం లేకుండా కంఫర్ట్‌ లుక్‌తో పార్టీని ఎంజాయ్‌ చేయచ్చు. 

►లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్, ధోతీ కట్టు శారీ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉన్న స్టైల్‌. ఇది వెస్ట్రన్‌ పార్టీలలో బాగా ఆకట్టుకునే స్టైల్‌ అయ్యింది. ఆధునికత– సంప్రదాయం మేళవించిన ఈ లుక్‌ నవతరం అమ్మాయిలకు అమితంగా ఆకట్టుకుంటుంది. 

►జార్జెట్, షిపాన్, డిజైనర్‌ సిల్క్‌ చీరల లుక్‌ పూర్తి ఆధునికంగా మారిపోవడానికి ఇదో సింపుల్‌ టెక్నిక్‌. స్కర్ట్‌ మీద ధరించే డౌన్‌ షోల్డర్‌ టాప్‌ని ఈ శారీకి బ్లౌజ్‌గా వేసుకుంటే చాలు. వేరే ఆభరణాలూ అవసరం లేదు.  

►ప్లెయిన్‌ చీరల కాంబినేషన్‌ వెస్ట్రన్‌ పార్టీలకే నప్పుతాయి. వీటికి డిజైనర్‌ టాప్స్‌ని బ్లౌజ్‌గా ఎంచుకుంటే మోడ్రన్‌ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ఈ కాంబినేషన్‌ శారీ గౌన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ స్టైల్‌ కట్‌తో కంఫర్ట్‌గా పార్టీలో వెలిగిపోవచ్చు.

►పెద్ద పెద్ద చారలు, ప్రింట్లు, బంగారు రంగు అంచులు ఉన్న చీరలు అయినా సరే ఒక లూజ్‌ లేదా బెల్‌ స్లీవ్స్‌ టాప్‌తో లుక్‌ని ఆధునికంగా మార్చేయవచ్చు. స్కర్ట్స్, ప్యాంట్స్‌ మీదకు వేసుకునే ఇలాంటి టాప్స్‌ని చీరల మీదకూ ధరించవచ్చు. నెక్‌ బోసిగా ఉందనుకుంటే బంగారం కాకుండా సిల్వర్‌ జువెల్రీని వేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement