
పువ్వుల కాలం వసంతంపువ్వుల ప్రింట్ల కాలం వానకాలమే!అమ్మాయిల వ్యక్తిత్వాన్ని వికసించేలాంటి బోల్డ్ ప్రింట్స్‌తో ఇదిగో పూలవాన.
ఇప్పుడంతా రెట్రో అదేనండి పాత తరం స్టైల్ తెగ హుషారెత్తిస్తుంది. ఫ్యాషన్ వేదికల మీదా, వివాహవేడుకలోనూ, సాయంకాలం పార్టీలోనూ అంతటా తానై చూపులను దోచేస్తుంది. ఇది మోడ్రన్ డ్రెస్సుల విషయంలోనే కాదు చీరకట్టులోనూ రెట్రో తెగ ఆకట్టుకుంటోంది.’’’ముఖ్యంగా పువ్వుల ప్రింట్లు వాటిని బంధిస్తున్నట్టుగా పెద్ద పెద్ద అంచుల బార్డర్లతో ఈ వింటేజ్ స్టైల్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.’’’పువ్వుల డిజైన్లు, పెద్ద అంచులకు కాంట్రాస్ట్ బ్లౌజ్ జత చేయడమూ ఫ్యాషనే! కాస్త పాతతరం ‘కళ’, ఇంకాస్త ఆధునికపు అలలు చేరి మరింత శోభాయమానంగా కనువిందుచేస్తున్నాయి. ’’’ అలంకరణలోనూ పాత కళను తీసుకురావడం ఇప్పుడు ఆధునిక వనితల అసలు సిసలైన స్టైల్‌గా మారింది.
జూకా జాకెట్
జూకాలు చెవులకు పెట్టుకుంటారు. అవి పెద్ద పెద్ద బుట్టలు కావచ్చు, వేలాడే హ్యాంగింగ్స్‌అవ్వచ్చు. అవే జూకాలు జాకెట్ మీద ఇంపుగా నిలబడితే అది కాస్తా జూకా స్టైల్ అవుతోంది.
జూకానే తగిలిస్తే
జాకెట్ వెనకాల ముడివేసే హ్యాంగింగ్స్ ప్లేస్‌లో ముచ్చటైన డిజైనర్ జూకాను తగిలిస్తే ఎంత అందంగా ఉంటుందో.. మీ వెనుక అతుక్కుపోయే చూపులు ఇట్టే చెప్పేస్తాయి.
మగ్గం వర్క్ జూకా
అచ్చు చెవి జూకాను పోలి ఉండే డిజైన్ జాకెట్ మీద జరీ తీగలతో మగ్గం మీద నేసి, కుందన్స్, ముత్యాలు పొందిగ్గా అమర్చితే ఎంతందమో చెప్పగలమా!
ప్యాచ్ వర్క్ జూకా
ఎక్కువ ఖర్చు లేకుండా జూకాను పోలి ఉండే డిజైనర్ ప్యాచ్‌ని జాకెట్ మీద గ్లూతో అతికించవచ్చు. లేదంటే సూది, దారంతో కుట్టేయవచ్చు.
కర్టెసి: భార్గవి కూనమ్
ఫ్యాషన్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment