ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.
భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది.
ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్‌కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంది.
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది.
ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్‌ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది.
ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.
(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!)
Comments
Please login to add a commentAdd a comment