హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ఆ రోజే! | Honor 8 India Launch Set for October 12 | Sakshi
Sakshi News home page

హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ఆ రోజే!

Published Tue, Oct 4 2016 11:15 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ఆ రోజే!

హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ఆ రోజే!

హ్యువాయ్ టెర్మినల్ బ్రాండ్ హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్కు ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 12న న్యూఢిల్లీ ఈవెంట్గా ఈ ఫోన్ను హ్యువాయ్ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించింది.  ధర, అందుబాటులో ఉండే వివరాలను ఆవిష్కరణ కార్యక్రమంలోనే హ్యువాయ్ ప్రకటించనుంది. వెనుకవైపు రెండు కెమెరాలు కలిగిఉండటం ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. పూర్తిగా ప్రీమియం మెటల్ డిజైన్, వెనుకవైపు ఫింగర్ప్రింట్ స్కానర్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
 
జూలైలోనే ఈ ఫోన్ చైనాలో ఆవిష్కరణ అయింది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ను హ్యువాయ్ తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర 1,999 యువాన్స్(సుమారు..20వేలు), 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,299 యువాన్స్(సుమారు రూ.23వేలు), 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్స్(సుమారు రూ.25వేలు)తో మూడు వేరియంట్లను చైనా మార్కెట్లోకి ఈ ఫోన్ విడుదలైంది. అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎన్ని వేరియంట్లలో ప్రవేశపెడుతుందో కంపెనీ వెల్లడించలేదు. 
 
హానర్ 8 ప్రత్యేకతలు...
5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ ఎటీపీసీ ఎల్సీడీ డిస్ప్లే
1.8 గిగాహెడ్జ్ కిరిన్ 950 ఆక్టా-కోర్ ప్రాసెసర్
3జీబీ లేదా 4జీబీ ర్యామ్
32జీబీ, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
153 గ్రాములు  
3000ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement