పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన హువావే..! | Huawei P50 Pocket Foldable Phone Launched | Sakshi
Sakshi News home page

Huawei: పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన హువావే..!

Published Thu, Dec 23 2021 10:15 PM | Last Updated on Fri, Dec 24 2021 8:28 AM

Huawei P50 Pocket Foldable Phone Launched - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువావే పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. హువావే లాంచ్‌ చేసిన మొదటి క్లామ్‌షెల్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా హువావే పీ50 పాకెట్‌ నిలవనుంది. ఈ ఫోన్‌ సాధారణ ఫ్లిప్‌ ఫోన్‌లాగా ఉండనుంది. హువావే పీ50 పాకెట్‌ తొలుత చైనా మార్కెట్లలో లభించనుంది.

వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా లభించనుంది. క్రిస్టల్ వైట్ , అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఎడిషన్‌ను డచ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ ఐరిస్‌ వాన్‌ హెర్పెర్‌తో హువావే జతకట్టింది.‍ 8జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్; ప్రీమియం ఎడిషన్‌ 12జీబీ + 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుంది.  హువావే పీ50 పాకెట్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 

హువావే పీ50 పాకెట్‌ ఫీచర్స్‌..!

  • 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌
  • హర్మోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 40ఎంపీ+ 13ఎంపీ + 32ఎంపీ రియర్‌ కెమెరా
  • 10.7ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 8జీబీ ర్యామ్‌+ 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 4000mAh బ్యాటరీ కెపాసిటీ
  • 40W ఫాస్ట్ ఛార్జింగ్‌

చదవండి: షిప్‌మెంట్‌లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement