బీజింగ్: హువాయి తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. హానర్ సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను హానర్ 7సీ పేరుతో ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా లాంచ్ చేసింది. చైనామార్కెట్లో మార్చి 13నుంచి విక్రయానికి లభ్యం. అయితే గ్లోబల్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉండేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు వేరియట్లలో ఇది లాంచ్ కాగా 3జీబీ/32 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.9000 గాను, 4జీబీ/64జీబీవేరియంట్ సుమారు ధర రూ. 13,400 గా ఉండనుంది.
హానర్ 7సీ ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే 18.9 యాస్పెక్ట్ రేషియో
1.8 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్
720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే సదుపాయం
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment