
మూడు కెమెరాల స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
బీజింగ్ : ఇప్పటివరకు మనం రెండు కెమెరాల స్మార్ట్ ఫోన్ లనే చూశాం. ఇక ఇపుడు మూడు కెమెరాలతో వినియగదారులను ఆకట్టుకోవడానికి రడీ గా ఉన్నాయి స్మార్ట్ ఫో్న్లు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హువాయ్, హానర్ బ్రాండ్ ఇలాంటి ఓ సరికొత్త మొబైల్ ను చైనాలో ఆవిష్కరించింది. తాజాగా లాంచ్ చేసిన 'వీ8' స్మార్ట్ ఫోన్ ను చైనాలో అందుబాటులో ఉంచింది. ఇండియన్ మార్కెట్ లో కూడా త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.
వెనుక రెండు 12మెగా పిక్సెల్ కెమెరాలు ఈ ఫోన్ లో ప్రత్యేక విశిష్టత. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ తో కంపెనీ రూపొందించింది. దీంతో ఈ ఫోన్ కు మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. మే 17నుంచి దీని అమ్మకాలు చేపడతామని కంపెనీ పేర్కొంది. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది.
హువాయ్ వీ8 ప్రత్యేకతలు...
5.7 అంగుళాల డిస్ ప్లే, 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగ్
కిరీస్ 950 చిప్ తో కూడిన ఆక్టాకోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, శక్తివంతమైన ప్రాసెసర్ తో హైస్పీడ్ తో పనిచేస్తుంది.
అంతర్గత మెమెరీ 32జీబీ, 64జీబీ వేరియంట్లు
మైక్రో ఎస్డీ కార్డుతో 128జీబీ వరకూ పెంచుకోవచ్చు
వెనుక 12 మెగా పిక్సెల్ రెండు కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్ టీఈ, బ్లూటూత్ 4.2, వైఫై
బ్యాటరీ సామర్థ్యం 3500ఎంఏహెచ్
అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 32జీబీ వేరియంట్ ధర 350 డాలర్లు అంటే దాదాపు రూ.23,500, మరో వేరియంట్ 64జీబీ ధర 439 డాలర్లు అంటే దాదాపుగా రూ.29,000 ఉండొచ్చని అంచనా.