
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ మేకర్ హువావే అద్భుత ఫీచర్లతో హానర్ నోట్ 10ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం చాలా కాలం ఎదురు చూసిన ఫ్యాన్స్‌ను ఊహించని ఫీచర్లతో సరప్రైజ్ చేసింది. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, ర్యామ్, కిరిన్ 970 చిప్‌సెట్, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ తదితర అమేజింగ్ పీచర్లతో హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ నోట్ 10ను రెండు వెర్షన్‌లలో (6జీబీ/64జీబీస్టోరేజ్, 8జీబీ/128 జీబీ స్టోరేజ్)ఇవాళ విడుదల చేసింది. రూ.28,115 ప్రారంభ ధరగా నిర్ణయించింది. మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ వేరియెంట్లలో బుధవారం నుంచి కస‍్టమర్లకు ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉండనుంది.
హానర్ నోట్ 10 ఫీచర్లు
6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2220 పిక్సల్స్ రిజల్యూషన్
ఇంటర్నల్ కిరిన్ 970 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
24+16 ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా
13 ఎంపీ సెల్పీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment