లిప్‌స్టిక్‌ ఇయర్‌ బడ్స్‌ను చూశారా...! | Huawei Watch GT 3 Freebuds Lipstick Unveiled | Sakshi
Sakshi News home page

Huawei: లిప్‌స్టిక్‌ ఇయర్‌ బడ్స్‌ను చూశారా...!

Published Sat, Oct 23 2021 6:37 PM | Last Updated on Sat, Oct 23 2021 8:47 PM

Huawei Watch GT 3 Freebuds Lipstick Unveiled - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువావే యూరప్‌ మార్కెట్లలోకి కొత్త హువావే నోవా 9 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా  సరికొత్త హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్‌, ఫ్రీబడ్స్‌ లిప్‌స్టిక్‌ ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది.  హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్‌ ఈ-సిమ్‌ సపోర్ట్‌ను పొందనుంది. యూరప్‌ మార్కెట్లలో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్‌ ధర సుమారు రూ. 21600గా ఉండనుంది. పలు స్ట్రాప్స్‌ ఆప్షన్స్‌తో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్‌ రానుంది. 

హువావే లాంచ్‌ చేసిన ఉత్పత్తుల్తో  ఇయర్‌బడ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇయర్‌బడ్స్‌  ఛార్జింగ్‌ కేస్‌ చూడటానికి లిప్‌స్టిక్‌ ఆకృతిలో ఉంది. మహిళ కొనుగోలుదారులను ఆకర్షించేందుకుగాను లిప్‌స్టిక్‌ షేప్‌లో హువావే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్‌బడ్స్‌ ధర సుమారు రూ.   21000 వరకు ఉండనుంది. కాగా ఈ గాడ్జెట్స్‌ను భారత మార్కెట్లలోకి త్వరలోనే రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
చదవండి: ఫేస్‌బుక్‌.. పేరు మార్చడం అంత ఈజీనా? మరి ఆ కంపెనీల సంగతి ఏంది?

హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్స్‌

  • 42మీ.మీ*46మీ.మీ డయల్‌ 
  • అమ్లోడ్‌ డిస్‌ప్లే విత్‌ అల్ట్రా కర్వ్‌డ్‌ 3డీ గ్లాస్‌
  • 32ఎమ్‌బీ ర్యామ్‌+4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 14 రోజులవరకు బ్యాటరీ బ్యాకప్‌
  • బ్లూటూత్‌, జీపీఎస్‌
  • టెంపరేచర్‌ సెన్సార్‌, ఆప్టికల్‌ హర్ట్‌ రేట్‌ రీడర్‌

హువావే ఫ్రీబడ్స్‌ లిప్‌స్టిక్‌ ఫీచర్స్‌..

  • ఆక్టివ్‌ నైక్‌ క్యాన్సిలేషన్‌
  • 22 గంటల మ్యూజిక్‌ ప్లే
  •  410mAh బ్యాటరీ

చదవండి: ఫేస్‌బుక్‌ నెత్తిన మరో పిడుగు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement