
హువావే సంస్థ నుంచి నోవా 4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది . ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ హోల్ పంచ్, 48 మెగాపిక్సెల్ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లని కంపెనీ తెలిపింది. నోవా సిరీస్‌కు కొనసాగింపుగా నోవా 3 తరువాత ఆ వరుసలో నోవా 4ను హువావే సోమవారం చైనాలో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో (20ఎంపీ కెమెరా, 48 ఎంపీ కెమెరా) విడుదల చేసింది. 48 మెగా పిక్సల్ వేరియంట్ ధర సుమారు రూ.35,300గా ఉండగా, 20 మెగా పిక్సల్ ధర సుమారు రూ.32,200 గా ఉండనుంది.
నోవా 4 ఫీచర్లు
6.4 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1080x2310 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్
2.36 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
48 +6+2 ఎంపీ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3750 ఎంఏహెచ్ బ్యాటరీ




Comments
Please login to add a commentAdd a comment