నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్ | Honor Holly 2 Plus Gold Sold out Within Minutes of the First Sale | Sakshi
Sakshi News home page

నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్

Published Thu, Feb 18 2016 7:41 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్ - Sakshi

నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్

న్యూఢిల్లీ: తాము ప్రవేశపెట్టిన హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లు నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని హువాయ్ సంస్థ తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లో ఫిబ్రవరి 15న అర్ధరాత్రి మొదటిసారి భారత్ లో అమ్మకాలు ప్రారంభించగా నిమిషాల్లో ఫోన్లు అన్నీ సేల్ అయిపోయాయని హువాయ్ ఇండియా కన్జుమర్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ వెల్లడించారు. ముఖ్యంగా గోల్డ్ కలర్ ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు.

భారత్ లో తమ ఫోన్లకు వచ్చిన స్పందన తమను థ్రిల్ కు గురిచేసిందని చెప్పారు. ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను డిజైన్ చేసినట్టు తెలిపారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచామని చెప్పారు. రివర్స్ చార్జింగ్ తో ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కు మైక్రో-బీ, మైక్రో-బీ యూఎస్ బీ కేబుల్ ద్వారా పవర్ షేర్ చేయొచ్చని చెప్పారు.

హానర్ హోలీ 2 ప్లస్ ఏమున్నాయంటే...
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీ
64-బిట్ క్వాడ్ ప్రాసెసర్
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ తో పాటు జీఎస్ఎం, సీడీఎంఏ, డబ్ల్యూసీడీఎంఏ సపోర్ట్
ధర రూ.8,499

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement