సాక్షి, ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌వాచ్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్‌వాచ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది.
జీటీ2 స్మార్ట్‌వాచ్ ఫీచర్లు
1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, రౌండ్ డయల్
హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్,
బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్
ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్
ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్,
ధరలు
46 ఎంఎం స్పోర్ట్ (బ్లాక్) రూ.15,990, లెదర్ స్ట్రాప్ మోడల్ రూ.17,990, మెటల్ స్ట్రాప్ రూ.21,990.
42 ఎంఎం వేరియంట్ ప్రారంభ ధర రూ. 14,990
డిసెంబర్ 12 - 18 వరకు వినియోగదారులు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అలాగే ముందస్తు బుకింగ్‌లో మొత్తం నగదు చెల్లించిన వారికి 6999 రూపాయల విలువైన హువావే ఫ్రీలేస్ ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభ్యం. 19 వ తేదీ అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు మొదటి సేల్‌కు అందుబాటులో వుంటుంది. హువావే మినిస్పీకర్ (రూ .2,999) గెలుచుకునే అవకాశం కూడా వుంది. 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వుంటుందని కంపెనీ తెలిపింది.అంతేకాదు తమ స్మార్ట్‌వాచ్ వినియోగదారుని హార్ట్ బీట్‌ను మానిటర్ చేస్తుందని, హృదయ స్పందన రేటు 100 బిపిఎమ్ కంటే ఎక్కువ లేదా 50 బిపిఎమ్ కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే వినియోగదారుడిని అలర్ట్ చేస్తుందని, స్విమ్మింగ్ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్ పనిచేస్తుందని హువావే వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment