హువావే సబ్ బ్రాండ్ హానర్ ప్రకటించిన విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోకి అడుగపెట్టబోతోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 22) లాంచ్ చేస్తోంది. అలాగే ఈ నెల 29న భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌కు ప్రారంభమైనాయని కంపెనీ ప్రకటించింది.
అద్భుతమైన ఫీచర్లు, ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్‌గా, వ్యూ సిరీస్‌లో టాప్ ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వ్యూ20 నిలవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,500. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,600గా ఉంది. ఇక ఈ డివైస్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.
హానర్ వ్యూ20 ఫీచర్లు
6.4 ఇంచెస్ డిస్‌ప్లే
కిరిన్ 980 ఆక్టాకోర్ సాక్
ఆండ్రాయిడ్ 9
1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
48 ఎంపీ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్పీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ కాగా హానర్ వ్యూ 20 మోషినో రెడ్ ఎడిషన్‌ను లేటెస్ట్ గా విడుదల చేసింది.
Sung too many tunes about reimagining your memories?
— Honor India (@HiHonorIndia) January 21, 2019
Upgrade to newer inventions with the #WorldsFirstTechnology of 48MP AI Camera on the #HONORView20!#SeeTheUnseen launching on 29th January!
Pre-book!#HONOR Store: https://t.co/rxo3bqIoma@amazonIN : https://t.co/6UArGjoHOJ pic.twitter.com/rvH7NVJ66s
Comments
Please login to add a commentAdd a comment