న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ హువావే.. తాజాగా ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ పేరుతో ట్యాబ్లెట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదలచేసింది. కాలేజీకి వెళ్ళేవారు, పని నిపుణులు, కళాకారులు, పిల్లలకు సరిపోయే విధంగా దీనిని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ డివైజ్ ధర రూ. 21,990 వద్ద నిర్ణయించింది. శక్తివంతమైన 8–కోర్ ప్రాసెసర్, 10.1 అంగుళాల డిస్‌ప్లే, 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది. నూతన ట్యాబ్ సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
‘5జీ’ ట్రయల్స్‌కు అనుమతి దక్కేనా..!
భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు హువావే ఆసక్తిని వెల్లడించగా.. జాతి ప్రయోజనాల ఆధారంగా ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ అన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 4 నెలల్లో స్పెక్ట్రమ్ వేలం ఉండనుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment