హువాయ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లు | Huawei launches Honor 6 smartphone at Rs 19,999 | Sakshi
Sakshi News home page

హువాయ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లు

Published Tue, Sep 30 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

Huawei launches Honor 6 smartphone at Rs 19,999

 న్యూఢిల్లీ: చైనాకు చెందిన  హువాయ్ కంపెనీ  ఒక స్మార్ట్‌ఫోన్‌ను, ఒక ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి సోమవారం ఆవిష్కరించింది. ఆనర్ 6 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,999కు, మీడియాపాడ్ ఆనర్ టీ1 పేరుతో ట్యాబ్‌ను రూ.9,999కు అందిస్తున్నామని హువాయ్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా సీఈఓ కై లిక్యూన్ చెప్పారు. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి లభ్యమవుతాయని వివరించారు. ఫోన్‌ను వచ్చే నెల 6 నుంచి విక్రయించడం ప్రారంభిస్తామని వివరించారు.

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఆనర్ 6 స్మార్ట్‌ఫోన్ 4జీ ఫోన్ అని, 5 అంగుళాల డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ట్యాబ్‌లో 8 అంగుళాల డిస్‌ప్లే, 1.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, వంటి ప్రత్యేకతలున్నాయని ఆయన వివరించారు.

 10 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించడం లక్ష్యం...
 ఆనర్ సిరీస్ కింద మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు తెస్తామని, వీటిని ఫ్లిప్‌కార్ట్ ద్వారానే విక్రయిస్తామని కై లిక్యూన్ చెప్పారు. ఈ ఏడాది 10 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా రూ.6,000 లోపు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement