
హువాయ్ ‘ఎంజాయ్ 7ప్లస్’ లాంచ్
చైనా మొబైల్ మేకర్ హువాయ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంజాయ్ 7 ప్లస్'ను లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో శనివారం ప్రవేశపెట్టింది. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.14,080, రూ.15,956 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. గోల్డ్, షాంపైన్ గోల్డ్, బ్లూ, బ్లాక్, సిల్వర్, గ్రే మరియు పింక్ కలర్స్‌లోఅందుబాటులోఉండనుంది. ఏప్రిల్ 28 నుంచి వివిధ ఆన్లైన్ స్టోర్లలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నట్టు సంస్థ ప్రకటించింది.
హువాయ్ ఎంజాయ్ 7 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 7720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్,
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4100 ఎంఏహెచ్ బ్యాటరీ