చైనా: ప్రముఖ టెక్ కంపెనీ హువావే నోవా 8 ప్రో, హువావే నోవా 8 స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌లు 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఈ ఫోన్లు కీరిన్ 985 ప్రాసెసర్ చేత పనిచేస్తాయి. హువావే నోవా 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డి + డిస్‌ప్లే ఉంది. మరోవైపు, హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. లాంచ్కి ముందు చైనా టెలికాం సైట్‌లో హువావే నోవా 8 యొక్క ఫీచర్స్ లీక్ అయ్యాయి.(చదవండి: లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర)
హువావే నోవా 8 ప్రో స్పెసిఫికేషన్లు
హువావే నోవా 8 ప్రో హార్డ్‌వేర్ ఫ్రంట్‌లోని నోవా 8తో సమానంగా ఉంటుంది. కానీ డిస్ప్లే, బ్యాటరీ మరియు ఫ్రంట్ కెమెరాలో తేడాలు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ (నానో) హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల పూర్తి-హెచ్‌డి + ఒఎల్‌ఇడి డిస్‌ప్లే (1,236x2,676 పిక్సెల్స్) తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్10 ఆధారిత ఈఎంయుఐ 11తో నడుస్తుంది. 5జీ హ్యాండ్‌సెట్‌లో హిసిలికాన్ ఆక్టా-కోర్ కిరిన్ 985 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి.
హువావే నోవా 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 16 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా. హువావే నోవా 8ప్రో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, యుఎస్బి టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఇది 184 గ్రాముల బరువు ఉంటుంది. ధర సుమారు రూ.49,600.
హువావే నోవా 8 ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.57 అంగుళాలు
ప్రాసెసర్: హిసిలికాన్ కిరిన్ 985
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3800ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ధర: రూ.37,200
Comments
Please login to add a commentAdd a comment