సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన శాంసంగ్ ఇండియా | Samsung Goes Bharat, 535 Service Vans to Connect 6,000 Talukas | Sakshi
Sakshi News home page

సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన శాంసంగ్ ఇండియా

Published Tue, Oct 18 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన  శాంసంగ్ ఇండియా

సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన శాంసంగ్ ఇండియా

న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా తాజాగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇందులో భాగంగానే 535 సర్వీస్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 తాలుకాల్లోని గ్రామాల్లో సంచరించనున్నాయి. అలాగే కంపెనీ 250కి పైగా సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అలాగే మరో 250కి పైగా రెసిడెంట్ ఇంజినీర్లను నియమించుకుంది. దీంతో కంపెనీ సర్వీస్ పాయింట్ల సంఖ్య 3,000కు పైగా చేరింది. శాంసంగ్ కస్టమర్ ఈ సర్వీస్ వ్యాన్ల సాయంతో కంపెనీ సేవలను త్వరితగతిన పొందొచ్చని శాంసంగ్ ఒక ప్రకటన లో తెలిపింది. కాగా శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో హెచ్‌సీ హాంగ్.. నోయిడాలోని కంపెనీ తయారీ ప్లాంటులో ఈ  కస్టమర్ సర్వీస్ వ్యాన్లను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement