న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం తగ్గింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు తగ్గిందని కంపెనీల రిజిష్ట్రార్(ఆర్‌ఓసీ)కి శామ్‌సంగ్ ఇండియా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం...,
60 శాతం ఆదాయం మొబైల్ ఫోన్లదే...
ఈ కంపెనీ మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.61,066 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.73,086 కోట్లకు పెరిగింది. దీంతో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాల ఆదాయం రూ.59,371 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.70,628 కోట్లకు చేరింది. దీంట్లో 60 శాతం ఆదాయం (రూ.43,088 కోట్లు)మొబైల్ ఫోన్ల విభాగం నుంచే వచ్చింది. టీవీ, కెమెరాల విభాగం ఆదాయం రూ.5,016 కోట్లు, గృహోపకరణాల విభాగం ఆదాయం రూ.7,408 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 55,284 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.70,228 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం రూ.711 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు ఎగసింది.
శాంసంగ్ లాభం 58% డౌన్
Published Tue, Dec 3 2019 5:16 AM | Last Updated on Tue, Dec 3 2019 5:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment