Registrar of Companies
-
పేటీఎం ఈ–కామర్స్ ఇక పాయ్ ప్లాట్‌ఫామ్స్
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ పేరు పాయ్ ప్లాట్‌ఫామ్స్‌గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్‌లో ఎలివేషన్ క్యాపిటల్‌కు మెజారిటీ వాటా ఉంది. పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు సాఫ్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్డీసీలో టాప్ –3 సెల్లర్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం అసోసియేట్ పేమెంటు బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్ మాజీ సీఎండీ ఆర్ రామచంద్రన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. -
ఆఫీసుల వెరిఫికేషన్ నిబంధనలకు మార్పులు ..
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం సంస్థల రిజిస్టర్డ్ చిరునామాలను అధికారులు భౌతికంగా ధృవీకరించుకునే నిబంధనలను కేంద్రం సవరించింది. వీటి ప్రకారం ఈ అంశంలో ఇకపై అధికారులు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ప్రసక్తి ఉండదు. సాధారణంగా ఏదైనా సంస్థ సరైన రీతిలో వ్యాపారం నిర్వహించడం లేదని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి అనుమానం కలిగినప్పుడు సదరు కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాకు వెళ్లి భౌతికంగా వెరిఫికేషన్ చేయవచ్చు. తాజా మార్పుల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో కంపెనీ నమోదైన ప్రాంతంలో ఉండే ఇద్దరు స్వతంత్ర సాక్షులు ఉండాలి. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. అలాగే కార్యాలయం ఫొటోనూ తీసుకోవాలి. ప్రాంతం, ఫొటోలు సహా వివిధ వివరాలతో కూడిన నివేదికను సవివరంగా రూపొందించాలి. -
అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌కు తగ్గిన నష్టాలు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీస్ నష్టాలు కొంత తగ్గి రూ. 4,748 కోట్లకు పరిమితమయ్యాయి. ఆదాయం 49 శాతం పెరిగి రూ. 16,200 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర నష్టం రూ. 5,849 కోట్లు కాగా ఆదాయం రూ. 10,848 కోట్లు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ సమర్పించిన పత్రాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం సమీక్షా కాలంలో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మొత్తం వ్యయాలు రూ. 16,877 కోట్ల నుంచి రూ. 21,127 కోట్లకు చేరాయి. ఉద్యోగులపై వ్యయాలు రూ. 1,383 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మాతృ సంస్థ నుంచి అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మూడు విడతల్లో రూ. 4,360 కోట్లు సమకూర్చుకుంది. ప్రతిగా అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్డాట్కామ్డాట్ ఐఎన్సీఎస్లకు 2020 జూన్‌లో రూ. 2,310 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 1,125 కోట్లు, డిసెంబర్లో రూ. 925 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది. -
సైరస్ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్
న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్సీఎల్ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్సీఎల్ఏటీ.. టాటా సన్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్.. సుప్రీం కోర్టును, అటు ఆర్వోసీ.. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
శాంసంగ్ లాభం 58% డౌన్
న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం తగ్గింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు తగ్గిందని కంపెనీల రిజిష్ట్రార్(ఆర్ఓసీ)కి శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం..., 60 శాతం ఆదాయం మొబైల్ ఫోన్లదే... ఈ కంపెనీ మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.61,066 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.73,086 కోట్లకు పెరిగింది. దీంతో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాల ఆదాయం రూ.59,371 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.70,628 కోట్లకు చేరింది. దీంట్లో 60 శాతం ఆదాయం (రూ.43,088 కోట్లు)మొబైల్ ఫోన్ల విభాగం నుంచే వచ్చింది. టీవీ, కెమెరాల విభాగం ఆదాయం రూ.5,016 కోట్లు, గృహోపకరణాల విభాగం ఆదాయం రూ.7,408 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 55,284 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.70,228 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం రూ.711 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు ఎగసింది. -
ఆ అధికారం సీబీఐకి లేదు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు నుంచి మమ్మల్ని తొలగించండి: హెటిరో డ్రగ్స్ హైదరాబాద్: కంపెనీలు పెట్టే పెట్టుబడులపై ఏవైనా అభ్యంతరాలుంటే కంపెనీల చట్టం కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) దర్యాప్తు చేస్తుందని జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి హెటిరో డ్రగ్స్ సంస్థ పేర్కొంది. ఈ చట్టం కింద వచ్చిన అభ్యంతరాలపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేదంటూ సంస్థ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదిం చింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సీబీఐ తమపై కేసు నమోదు చేసిందని, ఈ కేసు నుంచి తమను తొలగించాలని హెటిరో డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి తరఫున సోమవారం పిటిషన్ దాఖలైంది. ఐపీసీలో ఎక్కడా క్విడ్‌ప్రోకో లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘మాకు రూ.8.60 కోట్ల లబ్ధి కలిగిందని, ప్రతిగా జగన్ సంస్థల్లో మేం 19.5 కోట్లు పెట్టుబడి పెట్టామని సీబీఐ చెబుతోంది. దీన్లో పొంతనలేదు. పెపైచ్చు యాంకర్ యూనిట్‌గా మాకు ఇస్తామన్న రాయితీల్ని ప్రభుత్వమే ఇవ్వలేదు. కాబట్టి మాపై మోపిన నిరాధార అభియోగాలను తొలగించాలి’’ అని పిటిషన్లో కోరారు. దీనిపై ఆగస్టు 11లోగా కౌంటర్ వేయాలంటూ సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.