న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీస్ నష్టాలు కొంత తగ్గి రూ. 4,748 కోట్లకు పరిమితమయ్యాయి. ఆదాయం 49 శాతం పెరిగి రూ. 16,200 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర నష్టం రూ. 5,849 కోట్లు కాగా ఆదాయం రూ. 10,848 కోట్లు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ సమర్పించిన పత్రాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం సమీక్షా కాలంలో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మొత్తం వ్యయాలు రూ. 16,877 కోట్ల నుంచి రూ. 21,127 కోట్లకు చేరాయి. ఉద్యోగులపై వ్యయాలు రూ. 1,383 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మాతృ సంస్థ నుంచి అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మూడు విడతల్లో రూ. 4,360 కోట్లు సమకూర్చుకుంది. ప్రతిగా అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్ ఐఎన్‌సీఎస్‌లకు 2020 జూన్‌లో రూ. 2,310 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 1,125 కోట్లు, డిసెంబర్‌లో రూ. 925 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment