జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు నుంచి మమ్మల్ని తొలగించండి: హెటిరో డ్రగ్స్
హైదరాబాద్: కంపెనీలు పెట్టే పెట్టుబడులపై ఏవైనా అభ్యంతరాలుంటే కంపెనీల చట్టం కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) దర్యాప్తు చేస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి హెటిరో డ్రగ్స్ సంస్థ పేర్కొంది. ఈ చట్టం కింద వచ్చిన అభ్యంతరాలపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేదంటూ సంస్థ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదిం చింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సీబీఐ తమపై కేసు నమోదు చేసిందని, ఈ కేసు నుంచి తమను తొలగించాలని హెటిరో డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి తరఫున సోమవారం పిటిషన్ దాఖలైంది.
ఐపీసీలో ఎక్కడా క్విడ్‌ప్రోకో లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘మాకు రూ.8.60 కోట్ల లబ్ధి కలిగిందని, ప్రతిగా జగన్ సంస్థల్లో మేం 19.5 కోట్లు పెట్టుబడి పెట్టామని సీబీఐ చెబుతోంది. దీన్లో పొంతనలేదు. పెపైచ్చు యాంకర్ యూనిట్‌గా మాకు ఇస్తామన్న రాయితీల్ని ప్రభుత్వమే ఇవ్వలేదు. కాబట్టి మాపై మోపిన నిరాధార అభియోగాలను తొలగించాలి’’ అని పిటిషన్లో కోరారు. దీనిపై ఆగస్టు 11లోగా కౌంటర్ వేయాలంటూ సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
ఆ అధికారం సీబీఐకి లేదు
Published Wed, Jul 23 2014 1:35 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement