శాంసంగ్ ఇండియా భారీగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. దేశవ్యాప్తంగా టాప్ కాలేజీలనుంచి వీరిని ఎంపిక చేయనుంది. 5 జీ నెట్‌వర్క్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ సహా వివిధ కేటగిరీల్లో దాదాపు వెయ్యిమందిని నియమించుకోనుంది.
2018నాటికి టాప్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేయాలని యోచిస్తోందని శాంసంగ్ అధికారి ఒకరు ప్రకటించారు. ముఖ్యంగా ఐఐటీలతోపాటు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిట్స్ పిలాని, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు ఇందులో ఉన్నాయని తెలిపారు. 5జీ నెట్‌వర్క్ సహా ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయోమెట్రిక్స్, సహజ భాషా ప్రాసెసింగ్, రియాలిటీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అగ్‌మెంటెడ్ రియల్టీ నెట్‌వర్క్‌లకోసం ఈ ఇంజనీర్లను నియమించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment