
జగద్గిరిగుట్ట: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి లడఖ్‌కు బుల్లెట్ బైకులపై వెళ్లారు. కుత్బుల్లాపూర్, చింతల్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు ఈ నెల 1న ప్రయాణం మొదలుపెట్టి 17 రోజుల అనంతరం తొమ్మిది రాష్ట్రాలను దాటుతూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
చింతల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన అవినాష్, చరణ్‌జీత్ సింగ్, వినయ్, ఇస్తియాక్, ప్రదీప్, మనోజ్‌లు సుమారు 6400 కిలోమీటర్లు ఈ జర్నీ చేశారు. సంవత్సరం ముందు నుండి 1000–2000 కిలోమీటర్లు బైకులపై తిరుగుతూ జరీ్నకి కావాల్సిన వస్తువులు తెలుసుకున్నారు. 17,582 అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్, ఖర్దుంగ్లకు చేరుకున్నారు. ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చిన వీరికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment