సినీ డాన్సర్‌ ఆత్మహత్య | movie dancer commit to suicide | Sakshi
Sakshi News home page

సినీ డాన్సర్‌ ఆత్మహత్య

Published Mon, Nov 20 2017 7:00 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

movie dancer commit to suicide - Sakshi

తమిళసినిమా: సినీ డాన్సర్‌ శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. వివరాల్లోకెళ్లితే స్థానిక సాలిగ్రామం, దశరదపురం, మాపోసీ వీధికి చెందిన దేవి(37) అనే సినిమా గ్రూప్‌ డాన్సర్‌ శినివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దేవి తన తల్లి, కొడుకుతో కలిసి జీవిస్తోంది. శనివారం రాత్రి ఇంటి కింది పోర్షన్‌లో కొడుకు నిద్ర పోయాడు. పై గదిలో తల్లితో కలిసి దేవి నిద్రించింది. కొంతసేటి తరువాత లేచి చూసిన తల్లికి దేవి ఉరేసుకుని నిర్జీవంగా వేలాడుతుండడం కనిపించింది.

కూతురు ఆత్మహత్యను చూసి దిగ్భ్రాంతికి గురైన తల్లి విరుగంబాక్కం పోలీసులకు సమాచారాన్ని అందించింది. వెంటనే సంఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు దేవి మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టానికి పంపారు. అప్పుల బాధ తాళలేక దేవి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement