
పెరంబూరు: సినీ డాన్సర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక వడపళని, భజన్‌కోయిల్ వీధికి చెందిన రాధాకృష్ణన్ కుమారుడు సెంథిల్(36) అవివాహితుడు. చాలా కాలంగా సినీరంగంలో డాన్సర్‌గా పనిచేస్తున్నాడు. నృత్యదర్శకుడు, నటుడు లారెన్స్ గ్రూప్‌లోనూ పలు చిత్రాలకు పనిచేశాడు. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పిల్లలకు డాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా, సరైన సంబంధం కుదరడం లేదు. ఈ విషయం చెప్పి తన స్నేహితులతో బాధ పడుతుండేవాడని తెలిసింది. పెళ్లి కాలేదన్న మానసిక వేదనతో సెంథిల్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో విరుగంబాక్కం పోలీ సులు అక్కడికి వచ్చి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment