
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళా డ్యాన్సర్‌పై పోలీసు కానిస్టేబుల్ డబ్బులు వెదజల్లిన వీడియో వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమానికి సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన పోలీసుల్లో ఒకరు అత్యుత్సాహం కనబరచడంతో ఆయనపై అధికారులు వేటు వేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రైఫిల్ ధరించిన పోలీసు కానిస్టేబుల్ మహిళా డ్యానర్లపై డబ్బులు చల్లుతూ వీడియోలో కనిపించారు. ఆయనతో పాటు పలువురు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లను విసిరారు.
కాగా,2015లో గుజరాత్‌లోని వడోదరలో పెళ్లి వేడుకల్లో బాగంగా జరిగిన కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లుతూ ఇద్దరూ కానిస్టేబుళ్లు కనిపించడం దుమారం రేపింది. అదే ఏడాది వారణాసిలోనూ డ్యానర్లపై డబ్బులు విసురుతూ పోలీసు సిబ్బంది పట్టుబడ్డారు.