![Shahid Kapoor recalls shooting with Aishwarya Rai Bachchan for Taal as background dancer - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/11/aish.jpg.webp?itok=rvkH9b7H)
‘షాహిద్ కపూర్ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌లో పని చేస్తున్న కాలంలో సుభాష్ ఘాయ్ ‘తాళ్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నృత్యం చేసిన ‘జంగిల్ మే బోలే కోయల్ కుక్కూ’ పాటలో డ్యాన్సర్‌లలో ఒకరిగా అవకాశం వచ్చింది.
బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్‌జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ ‘వరస్ట్ అండ్ ది బెస్ట్ డే ఆఫ్ మైలైఫ్’ అని చెప్పాడు షాహిద్. అందాలతార పక్కన డ్యాన్స్ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్‌కు వస్తున్న షాహిద్ బైక్ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్’ సినిమా పాటలో ‘షాహిద్ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్ పక్కన ఉన్న అలనాటి షాహిద్ ఫొటో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment