బల్లెరినా డిప్రిన్స్‌ హఠాన్మరణం | Michaela Mabinty DePrince dies at 29 | Sakshi
Sakshi News home page

బల్లెరినా డిప్రిన్స్‌ హఠాన్మరణం

Published Sun, Sep 15 2024 6:06 AM | Last Updated on Sun, Sep 15 2024 6:06 AM

Michaela Mabinty DePrince dies at 29

వాషింగ్టన్‌: చిన్న వయస్సులోనే అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న బ్యాలె నృత్య కళాకారిణి మిఖెలా మబింటీ డి ప్రిన్స్‌ హఠాన్మరణం చెందారు. ఈమె వయస్సు 29 ఏళ్లు. ఈ విషాద వార్తను ఆమె ప్రతినిధి డిప్రిన్స్‌ ఇన్‌స్టా పేజీలో ప్రకటించారు. తనను గురించి తెలిసిన, విన్న అందరికీ ఒక మర్చిపోలేని స్ఫూర్తిని మిగిలి్చన డిప్రిన్స్‌ ఇక లేరని ఆమె కుటుంబం తెలిపింది. కారణాలను మాత్రం వెల్లడించలేదు. 

1995లో ఆఫ్రికాలోని సంక్షుభిత సియోర్రా లియోన్‌లో జన్మించిన డిప్రిన్స్‌ తల్లిదండ్రులు అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల పసి ప్రాయంలోనే అనాథాశ్రమంలో చేరాల్సి వచ్చింది. అక్కడి వారంతా తల్లిదండ్రులు లేని, విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్న తనను ‘దెయ్యం బిడ్డ’గా పిలుస్తుండేవారని చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకునేవారు. 

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జంట దత్తత తీసుకున్నాక ఆమె జీవితమే మారిపోయింది. వారు ఆమె ప్రతిభను గుర్తించి, బ్యాలెట్‌ క్లాసులకు పంపించారు. హార్లెంలోని డ్యాన్స్‌ స్కూల్‌లో అతిచిన్న వయస్సులోనే ప్రధాన డ్యాన్సర్‌గా ఎదిగి ఆమె చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక బోస్టన్‌ బ్యాలెలో 2021లో చేరారు. 17 ఏళ్లకే డ్యాన్సింగ్‌ విత్‌ ది స్టార్స్‌ అనే టీవీ షోలో ప్రదర్శన ఇచ్చారు. గాయని బియొన్స్‌ ‘లెమొనెడ్‌’ఆల్బంలోనూ డిప్రిన్స్‌ ఉన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement