Balle dancer
-
బల్లెరినా డిప్రిన్స్ హఠాన్మరణం
వాషింగ్టన్: చిన్న వయస్సులోనే అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న బ్యాలె నృత్య కళాకారిణి మిఖెలా మబింటీ డి ప్రిన్స్ హఠాన్మరణం చెందారు. ఈమె వయస్సు 29 ఏళ్లు. ఈ విషాద వార్తను ఆమె ప్రతినిధి డిప్రిన్స్ ఇన్‌స్టా పేజీలో ప్రకటించారు. తనను గురించి తెలిసిన, విన్న అందరికీ ఒక మర్చిపోలేని స్ఫూర్తిని మిగిలి్చన డిప్రిన్స్ ఇక లేరని ఆమె కుటుంబం తెలిపింది. కారణాలను మాత్రం వెల్లడించలేదు. 1995లో ఆఫ్రికాలోని సంక్షుభిత సియోర్రా లియోన్‌లో జన్మించిన డిప్రిన్స్ తల్లిదండ్రులు అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల పసి ప్రాయంలోనే అనాథాశ్రమంలో చేరాల్సి వచ్చింది. అక్కడి వారంతా తల్లిదండ్రులు లేని, విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్న తనను ‘దెయ్యం బిడ్డ’గా పిలుస్తుండేవారని చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకునేవారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జంట దత్తత తీసుకున్నాక ఆమె జీవితమే మారిపోయింది. వారు ఆమె ప్రతిభను గుర్తించి, బ్యాలెట్ క్లాసులకు పంపించారు. హార్లెంలోని డ్యాన్స్ స్కూల్లో అతిచిన్న వయస్సులోనే ప్రధాన డ్యాన్సర్‌గా ఎదిగి ఆమె చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక బోస్టన్ బ్యాలెలో 2021లో చేరారు. 17 ఏళ్లకే డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ అనే టీవీ షోలో ప్రదర్శన ఇచ్చారు. గాయని బియొన్స్ ‘లెమొనెడ్’ఆల్బంలోనూ డిప్రిన్స్ ఉన్నారు. -
హృదయరాగం
ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పుడు, నాట్యానికి ప్రత్యేకంగా రంగస్థలం ఎందుకు? అనుకున్నాడేమో న్యూయార్క్‌కు చెందిన డేన్ షిటగి. వివిధ దేశాల్లో, వివిధ భౌగోళిక సౌందర్యాల నేపథ్యంలో బ్యాలే డ్యాన్సర్ల నృత్య విన్యాసాలను తన కెమెరాలోకి అందంగా తీసుకువచ్చాడు. ఈ పని ఆయన పన్నెండు సంవత్సరాలుగా చాలా ఆసక్తితో చేస్తున్నాడు. రంగస్థలం మీద కనిపించని నృత్యాలకు కొత్త వెలుగు ఇస్తున్నాడు. ‘‘నృత్యం అంటేనే అందం...ఆ అందానికి మరింత అందాన్ని జోడించడానికి బాహ్యప్రపంచ అందాలను వాడుకుంటున్నాను’’ అంటున్నాడు డేన్ షిటగి. తీసిన ఒక్కో ఫొటో.... డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫొటోగ్రఫీల సమ్మేళనం అని గర్వంగా చెబుతాడు. తన ఫోటోల్లో నృత్యకారుల భావోద్వేగాలు కనిపిస్తాయనీ, హృదయరాగాలు వినిపిస్తాయనీ అంటాడు ప్రేమగా. ప్రసిద్ధ నర్తకులతో పాటు, ఒకప్పటి నర్తకులు, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నర్తకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాడు షిటగి. విశేషం ఏమిటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా షిటగి... పాతకాలపు ఫిల్మ్, కెమెరాలను వినియోగించడం!