#RIPRobin ప్రముఖ డ్యాన్సర్, స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్ స్టార్ రాబిన్ విండ్సర్ అకాలమరణం అభిమాన లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నాట్యంతో అందర్నీ అలరించిన రాబిన్ కేవలం 44 ఏళ్ల వయసులో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. దీంతో ఆర్‌ఐపీ అంటూ సంతాపసందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అతని మరణానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.
చాలా తొందరగా వెళ్లిపోయావు మిత్రమా అంటూ సన్నిహితులు అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. రాబిన్ విండ్సర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 2010-2013 మధ్య షోలో పాట్సీ కెన్సిట్, అనితా డాబ్సన్, లిసా రిలే , డెబోరా మీడెన్‌లతో కలిసి ఇచ్చిన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాడు
ఎవరీ రాబిన్ విండ్సర్
సెప్టెంబర్ 15, 1979న జన్మించిన రాబిన్ విండ్సర్ ఒక బ్రిటిష్ ప్రొఫెషనల్ లాటిన్ , బాల్‌రూమ్ డ్యాన్సర్. చిన్నప్పటినుంచీ డ్యాన్స్ పట్ల ఆసక్తి. అందుకే తల్లిదండ్రులు అతనిని మూడు సంవత్సరాల వయస్సులో ఇప్స్‌విచ్‌లోని స్థానిక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్‌లో ప్రో డ్యాన్సర్‌గా పాపులర్ అయ్యాడు.
Shocked & saddened by the tragic news this morning...condolences to his family, friends, colleagues & to the Strictly family this morning. 💔 #RobinWindsor #StrictlyComeDancing pic.twitter.com/FZZ9f1GW3z
— Barnsey (@officialbarnsey) February 20, 2024
Comments
Please login to add a commentAdd a comment