
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.

ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్‌లో నటించింది. ఈ సీరియల్‌లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్‌లో మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment