![Two wifes complaint About Dancer Who Got Married Twice - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/30/crime.jpg.webp?itok=icCX9LKq)
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఒకరికొకరికి తెలియకుండా రెండు వివాహాలు చేసుకున్న ఓ డాన్సర్‌పై ఇద్దరు భార్యలు శుక్రవారం మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం శెట్టిబలిజ వీధికి చెందిన సుమంత్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాన్సర్. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆరిలోవకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడంతో కొంత కాలం కిందట పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమంత్‌కు విజయవాడ ప్రాంతానికి చెందిన మరో యువతి పరిచయమైంది. ఆమెను పది రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికే సుమంత్‌కు పెళ్లయిన సంగతి విజయవాడ యువతికి తెలియదు. అలాగే విజయవాడ యువతితో ఇటీవల పెళ్లి జరిగిందన్న విషయం ఆరిలోవ బాలికకు తెలియదు.
చివరకు ఈ విషయాన్ని ఇతర స్నేహితుల ద్వారా గురువారం తెలుసుకున్న మైనర్ బాలిక, విజయవాడ అమ్మాయి లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయింత్రం మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
(చదవండి: పోలీసు ఇంటికే కన్నం)
Comments
Please login to add a commentAdd a comment