క్యారెక్టర్ నటునిగా గుర్తింపు
పొందాలనుంది
హాస్య నటుడు బంటి మనోగతం
రాయవరం : డ్యాన్సర్ అవ్వాలనుకుని యాక్టరయ్యానని అంటున్నారు నటుడు బంటి. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్యనటుడిగా చేస్తున్న బంటి ఆదివారం రాయవరంలో విజ్ఞాన్ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చాడు. ఈ సందర్భంగా డాన్సర్‌గా రాణిస్తూ.. నటుడిగా మారిన విషయాన్ని ఆయన విలేకరులకు తెలిపారు
ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నా స్వస్థలం విజయవాడ. నా అసలు పేరు ఎం.నాగసతీష్‌కుమార్. బీఏ ఎకనామిక్స్ చదివా. బేసిక్‌గా డాన్స్‌ర్‌ను. సినిమాల్లో యత్నించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. డాన్సర్‌గా పలు స్టేజ్ షోల్లో ప్రదర్శనలిచ్చా. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన డాన్స్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందాను. సినిమాల్లో నటించాలనే పట్టుదలతో హైదరాబాద్ వెళ్లాను. డాన్స్ ఇనిస్టిట్యూట్‌లో చేరి సినిమా అవకాశాల కోసం యత్నించాను. స్నేహితుల సహకారంతో ఆడిషన్స్‌కు వెళ్లగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ 100% లవ్ సినిమాకు నన్ను ఎంపిక చేశారు.
అంత్యాక్షరి గుర్తింపునిచ్చింది
ఇప్పటి వరకు 100% లవ్, హ్యాపీ హ్యాపీగా, పిల్ల జమీందార్, గబ్బర్‌సింగ్, రామయ్య వస్తామయ్యా, పిల్లా..నువ్వులేని జీవితం, రన్‌రాజారన్ సినిమాల్లో నటించాను. గబ్బర్‌సింగ్ సినిమాలో కేవలం హీరో పవన్‌కళ్యాణ్ నిర్వహించే అంత్యాక్షరి సీన్‌లో మాత్రమే నటించాను. ఆ సీన్ నాకు గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ సినిమాలో అవకాశం కోసం 45కేజీల బరువు పెరిగాను. ప్రస్తుతం హరిశంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రామ్ హీరోగా చేస్తున్న పండుగ చేస్కో, ఉలవచారు బిర్యానీ హీరో ప్రకాష్‌రాజ్ హీరోగా నటిస్తున్న కేటుగాడు తదితర ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం జిల్లాలోని రాజవొమ్మంగి ప్రాంతంలో లక్ష్మణ్‌వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హర్రర్ సినిమాలో నటిస్తున్నా.
మంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాలని ఉంది..ఇప్పటి వరకు కామెడీ తరహా పాత్రలు చేశాను. హీరో స్నేహితుడి పాత్రల చేస్తున్నాను. మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాలని ఉంది. అలాగే స్వతహాగా డాన్సర్‌ని కావడంతో డాన్సర్‌గా కూడా సినిమాల్లో రాణించాలని ఉంది. నా తండ్రి చేస్తున్న స్టోన్ క్రషర్ వ్యాపారం చూసుకుంటూనే సినిమాల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను.
డ్యాన్సర్ కాబోయి యాక్టరయ్యా
Published Mon, Apr 6 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM
Advertisement
Advertisement