న్యూఢిల్లీ: ప్రఖ్యాత భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ తాను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి బాధపడుతున్నానని కనీసం తనలాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్థిష్ట కార్డునైనా జారీ చేయాలంటూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజ్ఞప్తి చేశారు. సుధాచంద్రన్ ఒక కారు ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికి కృత్రిమ కాలుతో నృత్యం చేసి భారతదేశ గర్వపడే స్థాయికి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే.
(చదవండి: పైశాచికం: కొట్టి.. జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం)
ఈ మేరకు ఆమె వృత్తిరీత్యా ప్రయాణాల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిని ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో తాను చాలా బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సుధాచంద్రన్ మాట్లాడుతూ....నేనే ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. అంతేకాదు ఒక ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో చరిత్ర సృష్టించటమే కాక భారతదేశ గరవ్వపడేలా చేశాను.
అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థిస్తూ మోదీజికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
(చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!)
Comments
Please login to add a commentAdd a comment