Sudha Chandran
-
జంగిల్లో జింగిల్స్
మొదట్లో సుధాచంద్రన్‌కు పక్షులతో కాస్తో కూస్తో పరిచయం కూడా లేదు. అదృష్ట పల్లకి ఆమెను కేరళలోని తట్టెక్కాడ్ అభయారణ్యం వరకు తీసుకెళ్లింది. అది పక్షుల విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో పక్షులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. పక్షి ప్రేమికురాలుగా మారింది. ‘ఫారెస్ట్ గైడ్’గా పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే ‘పీవి థంపీ మెమోరియల్’ అవార్డ్ అందుకుంది...అద్భుతమై సంగీతాన్ని వినడానికి సుధాచంద్రన్ ఏ సంగీత కచేరికి వెళ్లదు. ప్రతిరోజు ఉదయాన పక్షుల కిలకిలారావాలు వింటుంది. అందులో ఆమోఘమైన రాగాలెన్నో వింటుంది. ముఖ్యంగా రాకెట్–బెయిల్డ్ డ్రోంగ్ మేలుకొలుపు జింగిల్స్ వినడం అంటే సుధకు ఎంతో ఇష్టం.మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యంతో అనుబంధం ఉన్న సుధ 300కి పైగా పక్షి జాతులను గుర్తించగలదు. వాటి పిలుపులు, బ్రీడింగ్ సీజన్, ఫీడింగ్ సీజన్, అలవాట్లు మరియు ఆవాసాలు, వలసలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ‘ఈ అడవి నా కుటుంబం లాంటిది’ అంటున్న సుధ నవ వధువుగా 1971 లో తట్టెక్కాడులోకి అడుగు పెట్టింది.‘ఆ కాలంలో ఇది దట్టమైన అడవి. ఇందులోకి అడుగు పెట్టినప్పుడు మొదట భయం వేసింది. అడవి నుంచి వచ్చే శబ్దాలు నన్ను భయపెట్టేవి’ అంటుంది సుధ. ఆమె భర్తకు తట్టెక్కాడ్లో టీ షాప్ ఉండేది. భర్త అకాల మరణం తరువాత సుధ అనేక సవాళ్లను, కష్టాలనూ ఎదుర్కొంటూనే ఇద్దరు పిల్లల్ని చదివించింది, ఒకవైపు టీ దుకాణం నడుపుతూనే డ్రైవింగ్, పడవ నడపడం నేర్చుకుంది. ఫొటోగ్రాఫీలో మెలకువలు తెలుసుకుంది.సుధ టీ షాప్‌కు పక్షుల ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలు వచ్చేవాళ్లు. వారితో సంభాషించడం వల్ల తనకు కూడా పక్షుల ప్రపంచంపై ఆసక్తి మొదలైంది. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ శిష్యుడు ఆర్.సుగతన్ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యేది. ‘నేను క్లాసు బయట నిల్చోవడం చూసి సుగతన్ సర్ లోపలికి వచ్చి క్లాసు వినాల్సిందిగా కోరేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సుధ.పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలతో కలిసి అడవిలో పక్షులను చూడడానికి వెళ్లేది. ‘నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతుంటాను’ అంటుంది సుధ.ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్న సుధ ఎన్నో భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు.ఇష్టమైన పక్షులను చూడడంలో అదృష్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతుంది సుధ. ‘ఒకసారి ఈ అభయారణ్యానికి వచ్చిన ఒక పక్షి శాస్త్రవేత్త మలబార్ ట్రోగాన్ను చూడాలనుకున్నారు. అయితే ఆయన ఆ పక్షిని గుర్తించలేకపోయాడు. నిరాశతో ఆయన వెనక్కి వెళ్లిపోదామనుకుంటున్నప్పుడు నేను ఆ పక్షిని చూపిస్తాను అని చె΄్పాను. అదృష్టవశాత్తు ఆ పక్షి మాకు కనిపించింది. అప్పుడు మాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సుధ.లైసెన్స్ పొందిన మొదటి మహిళా ఫారెస్ట్ గైడ్లలో ఒకరైన సుధాచంద్రన్ శాంక్చరి వైల్డ్‌లైఫ్ సర్వీస్ అవార్డ్(2023)తో సహా ఎన్నో అవార్డులు అందుకుంది. -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
క్లాసికల్ డాన్సర్, పద్మభూషణ్ అవార్డు గ్రహిత హఠాన్మరణం
లెజెండరి క్లాసికల్ డాన్సర్, పద్మభూషన్ అవార్డు గ్రహిత కనక్ రెలే(85) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి నటి హేమ మాలిని,సుధచంద్రన్లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కనక్ రెలే మోహీని అట్టం డాన్స్‌లో ప్రావీణ్యురాలు. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! అంతేకాదు ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా. శాస్త్రీయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. జూన్ 11, 1937లో గుజరాత్లో జన్మించిన కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు. చదవండి: గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చరణ్, చిరంజీవి ఏమన్నారంటే! Shocked to hear that Padmabhushan Kanak Rele ji has passed away. A dutiful family person, she was a true visionary, academician & a Mohini Attam performer par excellence. It is a day of great grief to the Rele and Nalanda Parivaar and the classical dance fraternity. Om Shanti 🙏 pic.twitter.com/HDhRFGO7j0 — Hema Malini (@dreamgirlhema) February 22, 2023 -
సుధా చంద్రన్ ఆవేదన.. క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్
సుధా చంద్రన్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ప్రముఖ నాట్యకారణి అయిన సుధా చంద్రన్ ఓ ప్రమాదంలో తన కాలును కోల్పోగా కృత్రియ కాలును అమర్చుకున్నారు. కృత్రిమ కాలుతో కూడా తన నాట్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల సుధ చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రతిసారి తన కృత్రిమ కాలును తొలగించమని అడుగుతునట్లు సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ తాజాగా సుధాచంద్రన్ పట్ల ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రవర్తించి తీరుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. ఈ మేరకు ట్విటర్లో సుధాచంద్రన్‌కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్ ప్రకారం విమనాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో కొన్ని అసాధారణ పరిస్థితులలో మాత్రమే కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా తమ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. CISF apologises to actor Sudhaa Chandran after she shared a video on being stopped at airport for prosthetic limb. "We'll examine why the lady personnel concerned requested Sudhaa Chandran to remove prosthetics & assure that no inconvenience is caused to travelling passengers." pic.twitter.com/oaVThYB0Lv — ANI (@ANI) October 22, 2021 ఇదిలా ఉండగా.. సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. నేను ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. -
‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ తాను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి బాధపడుతున్నానని కనీసం తనలాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్థిష్ట కార్డునైనా జారీ చేయాలంటూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజ్ఞప్తి చేశారు. సుధాచంద్రన్ ఒక కారు ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికి కృత్రిమ కాలుతో నృత్యం చేసి భారతదేశ గర్వపడే స్థాయికి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. (చదవండి: పైశాచికం: కొట్టి.. జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం) ఈ మేరకు ఆమె వృత్తిరీత్యా ప్రయాణాల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిని ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో తాను చాలా బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సుధాచంద్రన్ మాట్లాడుతూ....నేనే ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. అంతేకాదు ఒక ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో చరిత్ర సృష్టించటమే కాక భారతదేశ గరవ్వపడేలా చేశాను. అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థిస్తూ మోదీజికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. (చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!) -
బాధపడకమ్మా, నేను నీ కాలుగా ఉంటా అన్నారు: నటి
నటి సుధాచంద్రన్ తండ్రి కె.డి.చంద్రన్ (86) మే 16న మరణించారు. సుధా చంద్రన్ విజయగాథ వెనుక ఆయన స్ఫూర్తి చాలా ఉంది. ‘మయూరి’ సినిమాతో సుధా చంద్రన్ దేశమంతా తెలిశారు. ఆమె తమిళ నాట్యకారిణి అయినా తెలుగువారి వల్లే దేశానికి తెలియడం విశేషం. తెలుగులో ‘మయూరి’, హిందీలో ‘నాచే మయూరి’ ద్వారా హిట్ అయిన సుధా చంద్రన్ ముంబయ్‌లో తన కెరీర్‌ను స్థిరపరుచుకున్నారు. యాక్సిడెంట్ వల్ల కాలు కోల్పోయిన ఈమె ఆ తర్వాత కృత్రిమ కాలుతో డ్యాన్సర్‌గా, నటిగా కొనసాగారు. అయితే దీని వెనుక ఆమె తండ్రి కె.డి.చంద్రన్ మద్దతు, ప్రోత్సాహం చాలా ఉంది. హిందీ సినిమాలలో, సీరియల్స్‌లో నటుడుగా రాణించిన కె.డి.చంద్రన్ కూతురి కష్టకాలంలో ఆమెకు అండగా ఉన్నాడు. ఆమె కెరీర్లో కూడా తోడుగా ఉన్నాడు. కనుకనే మొన్న మే 16న ఆయన మరణించడంతో సుధా చంద్రన్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ‘ఆయనకు కోవిడ్ టెస్ట్ చేయించాం. నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని డాక్టర్లు చెప్పారు’ అని సుధా చంద్రన్ తెలియజేశారు. ‘నా ప్రతి అపజయాన్ని విజయంగా మార్చుకోవడం వెనుక మా నాన్న ఉన్నారు. యాక్సిడెంట్ వల్ల నా కుడి కాలు తీసేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని బాధపడకమ్మా... ఇకపై నేనే నీ కాలుగా ఉంటా అని అన్నారు.’ అని సుధా చంద్రన్ తండ్రి జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ‘మా నాన్న ఒక్కటే చెప్పేవారు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దు అని. ఆ మాటనే పాటించేదాన్ని. మా అమ్మ మరణించినప్పుడు ఆయన నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మా నాన్న ఎంతో సహాయకారి. ముంబయ్‌లో కేరళ కళాకారులను చాలామందిని సొంత డబ్బు ఇచ్చి ఆదుకునేవారు (సుధా చంద్రన్ పూర్వికులు పాలక్కాడ్‌కి వలస వెళ్లారు). మన దగ్గరకు సాయానికి వచ్చినవారు ఖాళీ చేతులతో వెళ్లకూడదు అనేవారు’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘పదేళ్లుగా నాన్న నాతోనే ఉంటున్నారు. అమ్మ చనిపోయాక ఆయన నాకు మరింత సమయం కేటాయిస్తూ వచ్చారు. ఉదయం ఆరు గంటలకే నిద్రలేచేవారు. తన కాలకృత్యాలు, దైనందిన చర్యలను క్రమం తప్పకుండా పాటించేవారు. కేవలం నటనా ప్రపంచంలోనే ఉండిపోకు. నీ చుట్టు పక్కల, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, నువ్వు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఉపయుక్తంగా ఖర్చు చేయడం, ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇలా ఎన్నో జీవిత సత్యాలను నాన్న నాకు తరచూ చెబుతుండేవారు’ అని తండ్రి చెప్పిన జీవిత సత్యాలను పేర్కొన్నారు. ‘అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో నాన్న నా దగ్గరికి వచ్చి... జన్మించిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఇది జీవిత సత్యం. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది నీకు అన్నారు. అలాగే జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండు. వ్యక్తులు, వస్తువులు, ప్రత్యేక విషయాలపై ఎప్పుడూ ప్రేమను పెంచుకోకు. అవన్నీ ఒకరోజు మనకు దూరమయ్యేవే అని గుర్తు పెట్టుకో. ఇలాంటి విషయాలు చెప్పి ఆయన నన్ను జీవితంలో స్ట్రాంగ్‌గా, రియాలిటీకి దగ్గరగా బతికేలా చేశారు. మా నాన్నను నేను మళ్లీ కలిసేవరకు చెప్పాలనుకున్నది ఒక్కటే... మరో జన్మంటూ ఉంటే నా తల్లిదండ్రులకే మరోసారి కూతురిలా జన్మించాలని కోరుకుంటున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు. మహేశ్ భట్ సినిమాలలో నటించారు కె.డి.చంద్రన్. ‘హమ్ హై రాహీ ప్యార్‌కే’ అందులో ఒకటి. ‘మహేశ్ భట్‌కు ఈ వార్త (తండ్రి మరణించిన వార్త) తెలుసో లేదో. ఆయన నుంచి ఇంకా నాకు మెసేజ్ రాలేదు’ అని సుధా చంద్రన్ అన్నారు. తెలుగు డబ్బింగ్ సీరియల్స్ వల్ల సుధా చంద్రన్ తెలుగు ఇళ్లకూ దగ్గరయ్యారు. -
ప్రముఖ నటి, డ్యాన్సర్ సుధాచంద్రన్ తండ్రి కన్నుమూత
ముంబై: ప్రముఖ డ్యాన్సర్, నటి సుధాచంద్రన్ తండ్రి, ప్రముఖ నటుడు కేడీ చంద్రన్ (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మే 12న ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘హమ్ హయిన్ రహీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే సప్నే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కోయీ మిల్ గయా’ తదితర చిత్రాలతో నటుడిగా కేడీ చంద్రన్ గుర్తింపు సంపాదించుకున్నారు. గుల్మోహర్ అనే టీవీ షోతోనూ ప్రేక్షకుల్ని అలరించారు. తండ్రి మరణంతో సుధాచంద్రన్ దుఖఃసాగరంలో మునిగిపోయింది. తండ్రి ఫోటోను షేర్ చేస్తూ.. 'మళ్లీ కలిసేవరకు గుడ్‌బై అప్పా. నీ కూతురిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు నేర్పించిన సూత్రాలు, నియమాలను నా చివరి శ్వాస వరకు పాటిస్తానని మాటిస్తున్నాను. వచ్చే జన్మలో కూడా నీ కూతురిగానే పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక కేడీచంద్రన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా 'మయూరి' సినిమాతో సుధాచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. భరతనాట్యం డ్యాన్సర్ అయిన సుధాచంద్రన్ తన డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇదే క్రమంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో నటించారామె. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) చదవండి : ఇలా జరుగుతుందని ఊహించలేదు: నటుడు ఎమోషనల్ నానమ్మ కోరిక నెరవేర్చలేకపోయా: హీరో -
స్ఫూర్తిసుధ
అతి చిన్నవయసులోనే నృత్య వేదికలను ఘల్లుమనిపించిన సుధాచంద్రన్.. తన అడుగుల కరతాళ ప్రతిధ్వనులను పూర్తిగా వినకుండానే పదహారేళ్ల వయసులో కాలును పోగొట్టుకున్నారు. పోయింది కాలే కానీ, ఆమె నిబ్బరం కాదు. ఒంటికాలి మీదే దీక్ష పట్టారు. నాట్యతపస్విని అయ్యారు. అనేక విజయ శిఖరాలను అధిరోహిచారు. నర్తకిగా, నటిగా, సమాజ సేవకురాలిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పుడు మళ్లీ మరొకసారి తెలుగులో చిన్ని తెర మీదకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో ఆత్మీయంగా ముచ్చటించారు. గంగానది జీవధార. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉగ్రరూపం దాలిస్తే అంత భయానకంగా ఉంటుంది. అందుకేనేమో ఈ దేశంలో స్త్రీని గంగానదితో పోలుస్తారు. కల్మషమైన లోకాన్ని స్వచ్ఛంగా మార్చే శక్తి స్త్రీకే ఉంది. అందుకే కావచ్చు సుధ తరచు ‘గంగ’ కాన్సెప్ట్‌తో నృత్యరూపకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ ముప్పై ఏళ్లుగా నృత్యంతో పాటు ఆమె హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినీ, టీవీ రంగాలలో పని చేస్తున్నారు. ‘‘ఇప్పుడిక ‘నెంబర్ వన్ కోడలు’ గా మీ వీక్షణకు నోచుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ తన జీవిత ప్రవాహంలోని మలుపుల తలపుల్లోకి వెళ్లిపోయారు సుధ. కూతురే పుట్టాలని..! అమ్మనాన్నలకు ఒక్కతే కూతుర్ని. నాన్న చంద్రన్‌ది కేరళ అయినా ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అమ్మ తంగం గృహిణి. శాస్త్రీయ సంగీతకారిణి. కొన్నాళ్లు క్లాసికల్ డ్యాన్సర్ సుధా దొరైవాన్ దగ్గర స్టెనోగ్రాఫర్‌గా వర్క్ చేసింది. కూతురు పుడితే సుధ అని పేరు పెట్టుకోవాలని, డ్యాన్సర్‌ని చేయాలని కలలు కంది. అందుకే నాకు మూడేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్పించింది. పదహారేళ్ల వయసు వచ్చేటప్పటికే నేను చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వగలిగానంటే అది అమ్మ ప్రయత్నము, పట్టుదలే. ఓ రోజు కారులో ఇంటికి వస్తుంటే జరిగిన ప్రమాదంలో కుడికాలును పోగొట్టుకున్నాను. ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. నాకిక భవిష్యత్తే లేదనిపించింది. ఆ సమయంలో.. ‘‘నువ్వు నిలబడాలి.. నువ్వు డ్యాన్స్ చేయాలి.. ’’ అంటూ అమ్మానాన్న ఇచ్చిన మనోబలం సామాన్యమైనది కాదు. నాన్న దిన, వార పత్రికలు తెచ్చి ఇచ్చి, వాటిల్లోని ఇన్స్పైరింగ్ స్టోరీలను చదవమనేవారు. టీవీలో వచ్చే ప్రతీ సమాచారాన్ని తెలుసుకోమనేవారు. ఏ చిన్న సమాచారం ఎవరు అడిగినా చెప్పేలా నన్ను తీర్చి దిద్దారు. ఇప్పటికీ నాకు చదివే అలవాటు పోలేదు. అమ్మ కూడా దిగులు పడటం మానేసి ధైర్యం తెచ్చుకొని నన్ను నిలబెట్టింది. కృత్రిమ కాలుతో రెండేళ్ల సాధన. రాత్రి–పగలు తేడా లేదు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లతో నరకం చూశాను. తర్వాత రెండేళ్లకు ఓ రోజు కృత్రిమ కాలుతో మొదటిసారి స్టేజి మీద మూడుగంటల సేపు నిర్విరామ ప్రదర్శన ఇచ్చాను. హాల్లో వెయ్యిమంది లేచి నిల్చొని తమ చప్పట్ల హోరుతో నాకు అభినందనలు తెలియజేశారు. ఆ సమయంలో మాటల్లో చెప్పలేనంత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఉప్పెనలా ముంచేసిన కష్టంలోంచి ఒక్కసారిగా బయట పడినట్లయింది. అత్తింటి అదనపు శక్తి ఇండియా, సౌదీ అరేబియా, అమెరికా, కెనడా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్లలో నృత్య ప్రదర్శనలు. దాదాపు అన్ని భాషా చిత్రాలలో నటిగా గుర్తింపు. ఒక కష్టాన్ని అధిగమించాక నాకు వచ్చిన అవకాశాలు ఎన్నో. వాటిల్లో ఒక్కదానినీ వదులుకోలేదు. సినిమాలు చేస్తున్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవి డంగ్తో పరిచయం ఏర్పడింది. తనది బెంగాలీ కుటుంబం. మానసికంగా దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అనుకున్న రెండు రోజుల్లోనే పెద్దల అంగీకారంతో పెళ్లయ్యింది. నేను దక్షిణాది అమ్మాయిని, తను ఉత్తరాది అబ్బాయి. పద్ధతుల్లో పూర్తి వ్యత్యాసాలున్న కుటుంబ నేపథ్యాలు అయినా అత్తింటివారంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. నెంబర్‌వన్ కోడలు జీ తెలుగులో ఈ వారమే మొదలైన ఈ సీరియల్ ద్వారా ‘వాగ్దేవి’గా పరిచయం అవుతున్నాను. విద్యాసంస్థలను నడిపే వ్యక్తిగా తన చుట్టూ ఉన్నవారంతా చదువులో నెంబర్‌వన్‌గా ఉండి తీరాలనుకుంటుంది వాగ్దేవి. అలాంటి వాగ్దేవి ఇంట అక్షరం ముక్క రాని కోడలు అడుగుపెడుతుంది. చేస్తున్న పనిలో నెంబర్ వన్‌గా ఉండాలనే నా తపనకు తగ్గట్లు వచ్చిన అవకాశం ఇది’’ అంటూ ముగించారు సుధాచంద్రన్. జీవితంలో వచ్చే సవాళ్లు ఒక్కోసారి పెను ఉప్పెనలా ముంచేస్తాయి. ఆ ఉప్పెన నుంచి ఉవ్వెత్తున లేవాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నిలబడిన శక్తి సుధాచంద్రన్. నేర్చుకోవాలనుకునేవారికి ఆమె జీవితం ఎప్పటికీ ఓ కొత్త పాఠం. – నిర్మలారెడ్డి ఫొటో: శివ మల్లాల చిన్న వయసులోనే! ►సుధ పందొమ్మిదేళ్ల వయసులో ‘మయూరి’ సినిమా ద్వారా నాట్యమయూరిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ►సుధ జీవిత చరిత్ర 8–11 ఏళ్ల వయసు స్కూలు పిల్లలకు అనేక రాష్ట్రాలలో పాఠ్యాంశమయింది. ►ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇన్వెర్టిస్ విశ్వవిద్యాలయం సుధను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. -
జీవితం ఓ ఛాలెంజ్..!
బంజారాహిల్స్: ఆమె జీవితం తెరిచిన పుస్తకం. కాలం కక్షగట్టినా.. పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎదురు నిలిచారేగానీ వెనక్కి తగ్గలేదు. నాట్యకారిణిగా ఎదగాలని కలలుగన్న ఆమెను విధి వంచించినా వెరవలేదు. అందుకే ఆమె జీవితం భావితరాలకు పుస్తక పాఠంగా మారింది. ‘సుధాచంద్రన్’.. నాట్యమయూరిగా కీర్తి గడించిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి. జీవితాన్ని చాలెంజ్ చేసి తనను తాను మలచుకున్నారు. కాలానికి ఎదురీది సినీ, టీవీరంగాలో ఎదిగారు. అంగవైకల్యం గల వారికి జైపూర్ కృత్రిమ కాళ్లు ఉచితంగా అందజేసేందుకు నిధుల సేకరణ కోసం భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి నగరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. శనివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగే వేడుకలో సుధాచంద్రన్ నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆ వివరాలు సుధా మాటల్లోనే.. నా జీవితంలో అతి ముఖ్యమైన ప్రతి సంఘటనా అందరికీ తెలిసిందే. ఒక కాలు పోగొట్టుకొని ఇక జీవితంలో ఏమీ సాధించలేనేమోనని కుంగిపోతున్న తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించింది. ‘మయూరి’ సినిమా ద్వారా కొత్త జీవితాన్నిచ్చింది. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ సినిమా షూటింగ్ ద్వారా నగరంతో మంచి అనుబంధం ఏర్పడింది. 1965 సెప్టెంబర్ 27న సుధాచంద్రన్ ఈ భూమ్మీదకు వచ్చింది. భరతనాట్యం అంటే పిచ్చిప్రేమ అనుకోకుండా 1981లో తిరుచరాపల్లి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్నారు. జీవితంలో ఇంకేం సాధించలేననుకున్నాను. అంతా శూన్యంమైపోయిందనుకున్నారు. అప్పుడే అప్పుడే జైపూర్ కృత్రిమ కాలును అమర్చుకున్నాను. ఆత్మవిశ్వాసంతో తిరిగి ప్రదర్శనలు ఇవ్వసాగాను. అలాంటి సమయంలో నా జీవితాన్నే ‘మయూరి’ సినిమాగా తీశారు. 1985లో విడుదలైన ఈ సినిమా ఇటు తెలుగులోను, అటు హిందీలోను హిట్ అయింది. 1986లో నేషనల్ ఫిల్మ్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాను. తర్వాత పది తమిళ సినిమాల్లో, ఐదు మళయాళ సినిమాల్లో, పది హిందీ సినిమాల్లో నటించాను. భరతనాట్యం నృత్యకారిణిగా ఇప్పటి దాకా మన దేశంతో పాటు అమెరికా, లండన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, తదితర 30 దేశాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పటికీ ఇస్తునే ఉన్నాను. హైదరాబాద్‌లోనూ 25కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా చార్మినార్ చూస్తాను. చూడిబజార్లో గాజులు కొనుక్కుంటాను. ప్రతి ప్రదర్శనా ఓ సందేశం నా నృత్య ప్రదర్శనల్లో ఓ సందేశం ఉంటుంది. జైపూర్ ఫుట్ నేపథ్యంగా శిల్పకళావేదికలో ఈ ప్రదర్శన ఇవ్వనున్నాను. ఇందులో కొంత మంది చాలెంజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ‘బాహుబలి’ కాన్సెప్ట్‌ను ఇందులో ప్రదర్శిస్తున్నాం. ప్రభాస్ శివలింగాన్ని ఎత్తినట్లు ఈ ప్రదర్శనలో నేను జైపూర్ కృత్రిమ కాళ్లు చూపించి ఎవరూ ఆత్మన్యూనతకు గురి కావద్దని చెప్పబోతున్నాను. గతంలో కూడా ముంబై పేలుళ్ల నేపథ్యంలో కాళ్లు, చేతులు కోల్పోయినన వారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ప్రదర్శనలు ఇచ్చాను. ప్రతి ప్రదర్శనలోనూ ఒక కాన్సెప్ట్‌ను తీసుకుంటున్నాను. ఇందులో ఎక్కువగా అంగవైకల్యం గల వారికి ఉచితంగా సేవలను అందించే సంస్థలు వారికి నిధుల సేకరణ ఉంటాయి. కళాకారులు సాధించిన విజయాల పట్ల సంతృప్తి ఉండదు. అలా ముందుకు సాగిపోయినవారే నిజమైన కళాకారులు. కళాకారులకు సృజనాత్మక శక్తి ఉంటుంది. దాంతో ఎప్పుడూ ఎంతోకొంత అసంతృప్తి అలానే ఉండిపోతుంది. దానికి అంతం ఉండదు. అందుకున్న విజయాలతో సంతృప్తి పడడం మంచిది కాదు. సంతృప్తి పడిపోతే అది అభివృద్ధికి చరమగీతం పాడుతుంది. కాలానికి అనుగుణంగా నడవాలి. భావాలను మార్చుకుంటూ ప్రేక్షకుల న్యాయమైన కోర్కెలను మాత్రం తీరుస్తూ ముందుకు సాగిపోవాలి. నటులైనా, రచయితలైనా, శిల్పి అయినా, లలిత కళలకు సంబంధించిన ఎవరైనా సరే అలాగే ఉండాలి. –సుధా చంద్రన్ నేడు సుధాచంద్రన్ నృత్య ప్రదర్శన పంజగుట్ట: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటుకు విరాళాలు సేకరణ కోసం, దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపడం కోసం రాజస్థాన్‌కు చెందిన సేవా సంస్థ ‘భగవాన్ మహావీర్ వికలాంగ్ సాహిత్య సమితి’(బీఎంవీఎస్ఎస్) ఆధ్వర్యంలో నేడు జైపూర్ ఫుట్ ప్రచారకర్త మయూరి సుధాచంద్రన్ నృత్యప్రదర్శన ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో జరిగే ప్రదర్శనకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీఎంవీఎస్ఎస్ ప్యాట్రన్ పి.సి. పారక్, అధ్యక్షుడు లక్ష్మీనివాస్ శర్మ, ఉపాధ్యక్షులు ఉషా పారక్, సంజయ్, వికలాంగుల సంఘం ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు కరపత్రాన్ని ఆవిష్కరించారు. -
తెలుగువాళ్లు నన్నుమరచిపోయారు!
సుధాచంద్రన్... మనోనిబ్బరంతో శారీరక వైకల్యాన్ని జయించిన సూపర్ ఉమన్! సినిమాలు, సీరియల్స్... డ్యాన్స్ స్కూల్స్, బొతిక్‌లు... ఇలా ఎందులో పాదం మోపినా, ఆమె ఇన్స్పైరింగ్గా నిలుస్తారు. ‘మయూరి’ తన జీవితానికే మైలురాయి అంటారు జైపూర్ పాదాల అందాల రవళి... సుధ! ‘మయూరి’ తన కెరీర్లో ఓ మైలురాయి అంటారు నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సుధాచంద్రన్ స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! ‘మయూరి’ సుధగా మీరు మా మనసులో నిలిచిపోయారు... నిలిచిపోతే సంతోషమే కానీ అది నిజం కాదనిపిస్తోంది... అదేంటి అంత మాటన్నారు? ‘మయూరి’ విడుదలైనప్పుడు తెలుగువారు చూపించిన అభిమానం నేను ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ మీరే నన్ను మర్చిపోయారనిపిస్తోంది. మీకు నేను గుర్తు ఉండివుండే తర్వాత కూడా తెలుగు సినిమాల్లో నటించి ఉండేదాన్నిగా! అంటే... మయూరి తర్వాత మీకు అవకాశాలే రాలేదా? ఒక్కటి కూడా రాలేదు. చాలా ఎదురు చూశాను... కనీసం ఒక్కరైనా పిలుస్తారేమో అని! ‘మయూరి’ని హిందీలో రీమేక్ చేస్తే... దాన్ని చూసి అక్కడి దర్శకులు వరుసగా అవకాశాలు ఇచ్చారు. తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా నటించాను. కానీ తెలుగువాళ్లు మాత్రం నన్ను పక్కన పెట్టేశారు. (నవ్వుతూ) కనీసం ఈ ఇంటర్వ్యూ చదివాకయినా గుర్తు చేసుకుంటారేమో చూడాలి. తెలుగు సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాను. ‘మగధీర’ నాకు చాలా నచ్చింది. ‘మనం’ కూడా బాగుందని ఈ మధ్యే ఎవరో చెప్పారు. తీరక లేక చూడలేదు. త్వరలోనే చూడాలి. ఒకప్పుడైతే విశ్వనాథ్‌గారి సినిమా అంటే వదలకుండా చూసేదాన్ని. హీరోయిన్స్‌ని చాలా ప్రత్యేకంగా చూపించేవారాయన. బాపుగారి సినిమాలన్నా చాలా ఇష్టం. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఇక సింగీతం శ్రీనివాసరావుగారయితే నా నట గురువు! ఆయనవల్లే నేనీరోజున నటిగా ఇలా కొనసాగుతున్నాను! తెలుగులో నటించాలని ఉందంటున్నారు. ఎలాంటి పాత్రలు..? నా వయసుకు తగ్గట్టుగా తల్లిగానో, అత్తగానో చాన్స్ ఇస్తే చేస్తాను. జయసుధగారిలాగా మంచి మంచి తల్లి పాత్రలు చేయాలని ఉంది. ఇక సీరియల్స్ విషయానికొస్తే... మీరు నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ఫేమస్ అయినట్టున్నారు? పాత్ర నెగిటివా, పాజిటివా అని ఏముంది! మన ప్రతిభను వెలికి తీసేది ఏదైనా మంచి పాత్రే. మొదట ఓసారి అలాంటి రోల్ చేశాను, బాగా పండటంతో అలాంటివే వచ్చాయి. మీరు కాస్త ఓవర్‌గా మేకప్ అవుతారని కొందరు అంటుంటారు... అలా అనేవాళ్లు ఒక్కసారి నాకు షూటింగ్ లేనప్పుడు వచ్చి చూస్తే... అసలు నేనా? కాదా? అని ఆశ్చర్యపోతారు. సాదా సీదా దుస్తులు వేసుకుంటాను. పౌడర్ కూడా రాసుకోను. కానీ సీరియళ్లలో, సినిమాల్లో ఇలా కనిపిస్తే చూస్తారా! హీరోయిన్ పూరి గుడిసెలో ఉంటుంది... హీరోతో డ్యూయెట్ మాత్రం స్విట్జర్లాండులో పాడుకుంటుంది. సీరియళ్లలో హీరోయిన్లు పట్టు చీరతోనే పడుకుని నిద్రపోతారు. ఏడుపు సీనులో కూడా ఫుల్లుగా మేకప్ వేసుకునే కనిపిస్తారు. ఎందుకంటే దృశ్యాలు కంటికి అందంగా లేకపోతే ప్రేక్షకులు చూడరు. ఇవాళ దక్షిణాది వాళ్లు హిందీ సీరియళ్లను పెద్ద యెత్తున డబ్ చేస్తున్నారంటే కారణమేంటి? ఉత్తరాది సీరియళ్లలో ఆర్టిస్టుల మేకప్, సెట్టింగ్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూడ్డానికి తెలుగువారూ ఇష్టపడుతున్నారు కదా! ప్రేక్షకులకు నచ్చేది చేయడమే మా పని. మీరు పెట్టుకునే బొట్టుబిళ్లలు కూడా చాలా ఫేమస్ కదా? అవును. నా పేరుతో రకరకాల బొట్టుబిళ్లలు మార్కెట్లో కూడా దొరుకుతాయి. చాలామంది నా దుస్తుల గురించి కూడా అడుగుతుంటారు. నేనే డిజైన్ చేసుకున్నాను అని చెబితే ఆశ్చర్యపోతుంటారు. సలహాలు కూడా అడుగుతుంటారు. నా అభిరుచికి, ప్రతిభకి ప్రశంసలు దొరుకుతున్నప్పుడు వాటిని లైట్‌గా ఎందుకు తీసుకోవాలి! అందుకే ఈ మధ్యనే చెన్నైలో ‘సుధాచంద్రన్ కలెక్షన్స్’ పేరుతో ఓ బొతిక్ కూడా తెరిచాను. ఫ్యాషన్ అనేది పెద్ద ప్రపంచం. రాణించగలననుకుంటున్నారా? నేనేదో గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చేసుకోవాలనో, బోలెడన్ని డబ్బులు సంపాదించేయాలనో ఆ పని చేయలేదు. నాలో ఉన్న ఆసక్తిని, ప్రతిభని ఎందుకు వృథా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే బొతిక్ పెట్టాను. దానికి సాక్ష్యం నేను పెట్టిన రేట్లే. నేను మిడిల్‌క్లాస్ అమ్మాయిని. అందుకే మధ్య తరగతి వాళ్లకి, అంతకంటే దిగువన ఉన్నవాళ్లకి కూడా నా డిజైన్స్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. ముందు ముందు మరికొన్ని నగరాల్లో కూడా నా బొతిక్‌ని విస్తరించాలనుకుంటున్నాను. మీకు డ్యాన్సే ప్రపంచం కదా! మరి నటన... డిజైనింగ్... వీటన్నిటి వల్ల నాట్యానికి దూరమవ్వడం లేదంటారా? డ్యాన్స్ నా ప్రపంచమే కాదు... జీవితం కూడా! మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాను. అది చూసి అమ్మానాన్నలు నన్ను మంచి డ్యాన్సర్‌ని చేయాలని ఆశపడ్డారు. కానీ అంత చిన్న పిల్లని మేం చేర్చుకోం అన్నారు మాస్టర్లు. చివరకు రామస్వామి భాగవతార్గారు నా టాలెంట్ చూసి ముచ్చటపడి తన ‘కళాసదన్’లో చేర్చుకున్నారు. అలా మొదలైన నా కళాప్రస్థానం వందల ప్రదర్శనలిచ్చేదాకా సాగింది. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. ముంబైలో నా పేరుమీద డ్యాన్స్ అకాడెమీ కూడా ఉంది. దానికి రెండు బ్రాంచిలు కూడా ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా వెళ్లి అక్కడ పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెబుతుంటాను. నాకు డ్యాన్స్ తర్వాతే ఏదైనా! అప్పట్లో (తొంభైల్లో) రాజకీయాల్లో కూడా చేరారు కదా... తర్వాత ఎందుకు దూరమయ్యారు? అది నా ఆసక్తి కాదు. వెంకయ్యనాయుడుగారు ఆహ్వానించడంతో బీజేపీలో చేరాను. అది కూడా నాలాంటి ఫిజికల్లీ చాలెంజ్డ్ కోసం ఏదైనా చేయాలన్న తపనతో! కానీ, అప్పట్లో ఆ పార్టీ పాలనలోకి రాకపోవడంతో నేను కోరుకున్నది సాధ్యం కాదని అర్థమై దూరంగా ఉండిపోయాను. మరిప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా... పిలుపు రాలేదా? లేదు. అప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తు చేసుకుని వాళ్లు నన్ను మళ్లీ పిలవాలని నేనేమీ ఆశపడటం లేదు. కాకపోతే వ్యక్తిగతంగా నాకు మోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దేశం ఆయన చేతుల్లోకి వెళ్లింది కాబట్టి ఏ విషయంలోనైనా అభివృద్ధి సాధించడం సాధ్యమనిపిస్తోంది. అవకాశం దొరికితే ఆయన హయాంలో నేననుకున్నది చేయగలుగుతానని నమ్మకం ఉంది. పదవి వరిస్తే... ఓ మహిళగా మహిళల కోసం ఏమైనా చేస్తారా? ఎవరో వచ్చి సాయం చేయాలని, మన జీవితాలు బాగు చేయాలని కోరుకోవడం నాకు నచ్చదు. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అలాంటప్పుడు ఎంపవర్మెంట్ గురించి చర్చలు, రిజర్వేషన్ బిల్లులు అవసరమా? నా దృష్టిలో బిల్లు అనేది ఓ కాగితం. అది జీవితాలను మార్చదు. కాబట్టి ఎవరి సాయం కోసం చూస్తూ కూచోకుండా, ఏమాత్రం చేసుకోగలిగినవాళ్లయినా, ఎవరికి వారే చైతన్యంతో ముందడుగు వేయాలి. ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? కొంత నా తల్లిదండ్రుల వల్ల. కొంత నా జీవితం నాకు నేర్పిన పాఠాల వల్ల. పదహారేళ్ల వయసులో నా జీవితం ఒక్కసారిగా తారుమారైపోయింది. ఈ ఆత్మవిశ్వాసమే లేకపోతే అసలీ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఆ సంఘటన గురించి కాస్త వివరంగా... అది 1981వ సంవత్సరం... మే 2వ తేదీ. అమ్మానాన్నలతో కలిసి తిరుచ్చి వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని బస్సులో తిరిగొస్తున్నాను. ఉన్నట్టుండి పెద్ద శబ్దం! పెద్ద కుదుపు! మాకు యాక్సిడెంట్ అయ్యిందని అర్థం కావడానికి సమయం పట్టింది. డ్రైవర్ చనిపోయాడు. దాదాపు అందరూ గాయపడ్డారు. నేనొక్కదాన్నే కాస్త బాగున్నాననిపించింది. కానీ లేవాలని ప్రయత్నించినప్పుడు అర్థమైంది నా పరిస్థితి. నా కాళ్లు రెండూ సీట్ల కింద ఇరుక్కుపోయాయి. కొందరు వచ్చి అతి కష్టమ్మీద బయటకు లాగి, దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నా కుడికాలుకు బాగా గాయమవడంతో డాక్టర్లు సిమెంటు కట్టు వేశారు. తర్వాత అమ్మానాన్నలు నన్ను చెన్నై తీసుకెళ్లిపోయారు. అంతా మామూలైపోతుందని అనుకున్నాం. కానీ కాలి నొప్పి ఎక్కువ కాసాగింది. కాలు రంగు కూడా మారసాగింది. దాంతో నన్ను మళ్లీ చెన్నైలోని విజయా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కట్టు విప్పుతూనే డాక్టర్... ‘ఓ గాడ్’ అన్నారు. అప్పుడే సెన్స్ చేశాను... ఏదో దారుణం జరగబోతోందని! తర్వాత...? ఏమయ్యిందని డాక్టర్ని అడిగితే... ఆయన నాతో ఏమీ చెప్పలేదు. తర్వాత అమ్మానాన్నలను బయటకు తీసుకెళ్లి, వాళ్లతో ఏదో మాట్లాడారు. నాన్న లోపలకు వచ్చి, నా చేయి పట్టుకుని, ‘సుధా... నీ మడమ దగ్గర చిన్న గాయముందని గమనించకుండా డాక్టర్లు నీకు సిమెంట్ కట్టు వేశారు. దానివల్ల నీ కాలు సెప్టిక్ అయ్యింది... కాలు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు’ అంటూ మెల్లగా చెప్పారు. నాన్న ఆ విషయం అలా చెబుతుంటే... నా కలల ప్రపంచం నా కళ్లముందే కూలిపోతున్నట్టుగా అనిపించింది నాకు! ఎలా తట్టుకున్నారు అంతటి నిజాన్ని? తట్టుకోక తప్పని పరిస్థితి! అయితే కాలు తీసేస్తానన్నందుకు కాదు... కాలు లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలనన్నదే నా బాధ! ఇప్పుడు ఎవ్వరు అడిగినా చాలా సింపుల్‌గా చెప్పేస్తాను కానీ... ఆ సమయంలో నేను పడిన వేదన సామాన్యమైనది కాదు. కానీ మెలమెల్లగా జీవితంతో రాజీ పడసాగాను. ఇంతలో జైపూర్ లెగ్ గురించి ఓ పేపర్లో డాక్టర్ సేథీ ఇచ్చిన ఇంటర్వ్యూ చదివి, వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటిదాకా అసలు నడవగలనా అనుకున్నదాన్ని, ఆయన చెప్పిన మాటలతో, ఇచ్చిన ధైర్యంతో డ్యాన్స్ కూడా చేయగలనని నమ్మాను. తొలిసారి (కృత్రిమకాలితో) ప్రదర్శనిచ్చినప్పుడు మీ ఫీలింగ్..? ఇంతకు ముందులా చేయగలనో లేదోనని మొదట కంగారుపడ్డాను. నాన్న ధైర్యం చెప్పారు. మహా ఆయితే ఆడిటోరియంలో ఇరవై మందో ముప్ఫై మందో ఉంటారనుకుంటే, వెయ్యిమంది ఉన్నారు. వాళ్లంతా నన్ను చూస్తూనే లేచి నిలబడి చప్పట్లు కొట్టసాగారు. అప్పటికేమీ సాధించలేదు కానీ సాధించాలన్న నా పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు... మూడు గంటల పాటు డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత కలిసినప్పుడు డాక్టర్ సేథీ అన్నారు... ‘మొత్తానికి చేసి చూపించావ్. కానీ ఎలా చేశావ్’ అని. ‘మీరే కదా అన్నారు, నేను డ్యాన్స్ చేయగలనని’ అన్నాను అయోమయంగా. ‘నేనేదో నిన్ను డిజప్పాయింట్ చేయకూడదని అలా అన్నాను, నువ్వు దాన్ని నిజం చేసి చూపించావ్’ అన్నారాయన. ఆయన నా పాలిట దేవుడు. ఆయనే లేకుండా సుధ ఇవాళ ఉండేది కాదు. అలాగే మా అమ్మానాన్నలు. నాకోసం ఎన్నో కలలు కన్నా, నాకిలా అయ్యిందన్న నిరాశ వాళ్ల ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం చాలా జాలిని ప్రదర్శించేవారు. ఒక్కతే కూతురు, ఎలా అయ్యిందో పాపం అని కొందరు... కూతుర్ని డ్యాన్సర్‌ని చేయాలనుకుంటే, నడవడానికే లేకుండా పోయిందే అని ఇంకొందరు... ఆ కామెంట్స్ వినకూడదనే అమ్మ రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్లేది. అవన్నీ గుర్తొస్తే ఇప్పటికీ తమ కళ్లు చెమరుస్తాయి. వాళ్లు బాధను మనసులో దాచుకుని నాకు ఆనందాన్ని పంచారు. అందుకే వాళ్ల కలను నెరవేర్చి తీరాలనుకున్నాను. మీ వారి గురించి... మా వారి పేరు రవి ఢంగ్. ఓ పంజాబీ సినిమా సెట్లో తొలిసారి చూశాను ఆయన్ని. ఆ సినిమాకి ఆయన అసిస్టెంట్ డెరైక్టర్. మా పరిచయం పరిణయానికి దారి తీసింది. ఆయనతో జీవితం బాగుంటుందనిపించింది. ఆ నమ్మకమే నిజమైంది. ఆయన నాకు చాలా పెద్ద సపోర్ట్! మాకు పిల్లలు లేరు. అయినా నాకేం బాధ లేదు. తను ఉన్నారు. అదే చాలు అనుకుంటాను. దత్తత తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదా? నాకు అడాప్షన్ మీద నమ్మకం లేదు. ఇష్టం కూడా లేదు. నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అందరూ నిజాయతీగా ఉండాలి. ఎవరు కాస్త తప్పుగా ప్రవర్తించినా దూరంగా పెట్టేస్తాను. నా బిడ్డ అయినా అంతే. అలాంటప్పుడు ఏ ఒక్క క్షణంలోనైనా... ‘వీడు నా బిడ్డ అయితే ఇలా చేసేవాడా’ అనుకున్నానంటే తనకి అంత ద్రోహం చేసినదాన్ని అవుతాను. అందుకే దత్తత చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ పిల్లలు లేని వెలితి ఎప్పుడైనా బాధిస్తే...? అలా జరగదు. బిడ్డల నిరాదరణకు గురై ఫుట్‌పాత్‌ల మీద, అనాథాశ్రమాల్లోను, రైల్వేస్టేషన్లలోనూ ప్రాణాలు విడుస్తున్న తల్లిదండ్రులెంతమందిని చూడటం లేదు! వాళ్లంతా కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుని ఉంటారు. వాళ్లమీదే ప్రాణాలు పెట్టుకుని వుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చింది! అందుకే పిల్లలు ఉండి తీరాలి అన్న ఆశ, వాళ్లు ఉంటేనే సంతోషంగా ఉంటామన్న అభిప్రాయం నాకెప్పుడూ లేవు. ఇప్పటి వరకూ గడిపిన జీవితం తృప్తి కలిగించినట్టేనా? ఎలాంటి రిగ్రెట్స్ లేవు. వచ్చినదాన్ని వచ్చినట్టుగా స్వీకరించడం, రేపు ఏం జరుగుతుందోనని చింతించకపోవడం నన్నెప్పుడూ హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు, నేనెప్పుడూ సక్సెస్‌ని మెజర్ చేయను. చేస్తే అక్కడితో ఆగిపోతాం. అందుకే ఏం చేశాను అన్నదానికంటే, ఇంకా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను. ఎప్పుడూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఎప్పుడూ అదే చేస్తాను! - సమీర నేలపూడి నా యాక్సిడెంట్, కాలు తీసేయడం, నేను ఆర్టిఫీషియల్ లెగ్‌తో మళ్లీ డ్యాన్స్ చేయడం మాత్రమే నిజం. మిగతాదంతా కల్పనే. అందులో చూపినట్టు నేను తల్లిలేని పిల్లనీ కాదు, నాకు సవతి తల్లి ఆరళ్లూ లేవు. మా నాన్న అంత అమాయకుడు, బలహీనుడు అంతకన్నా కాడు. సినిమా కోసం ఆ పాత్రను అలా తీర్చిదిద్దారంతే! అంతే కాదు... (నవ్వుతూ) ఆ సినిమాలోలాగా నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. సినిమా కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారంతే!