తండ్రికి కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. నీలాంటి కూతురుండాలి! | Manisha Rani Gifts Car to Her Father, Cost Details Inside | Sakshi
Sakshi News home page

తండ్రి కలను నెరవేర్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రతి డ్రీమ్‌ నెరవేరుస్తానంటూ..

Published Fri, Jul 5 2024 10:31 AM | Last Updated on Fri, Jul 5 2024 11:33 AM

Manisha Rani Gifts Car to Her Father, Cost Details Inside

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, డ్యాన్సర్‌ మనీషారాణి బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీ బిగ్‌బాస్‌.. ఓటీటీ రెండో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత డ్యాన్స్‌ రియాలిటీ షో ఝలక్‌ దిక్‌లాజా 11వ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా పాల్గొని ఏకంగా ట్రోఫీ అందుకుంది. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లోనూ కనిపించి కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తండ్రికి ఊహించని బహుమతిచ్చింది.

అవన్నీ నా కలలు కూడా..
మహీంద్రా కారు కొనిచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో తన తండ్రికి కొత్త కారు తాళాన్ని అందిస్తూమురిసిపోయింది. మా నాన్న కొత్త కారు. ఆయన కోరిక నెరవేర్చుతూ కారు గిఫ్ట్‌గా ఒచ్చాను. ఆయన కన్న కలలన్నీ తనవి మాత్రమే కావు, నావి కూడా! అవన్నీ నెరవేరుస్తాను అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీని ధర దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. 

గర్వంగా ఉంది
ఈ వీడియో చూసిన అభిమానులు.. నిన్ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నీలాంటి కూతురు ఉండాలి, మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి కష్టంతో పైకి ఎదిగి తండ్రి కలల్ని నెరవేరుస్తుంటే అంతకన్నా ఇన్‌స్పిరేషన్‌ ఇంకేముంటుంది? మధ్యతరగతి నుంచి వచ్చే అమ్మాయిలకు నువ్వొక రోల్‌ మోడల్‌.. అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.

చదవండి: దర్శన్‌ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement