
నల్గొండలో పుట్టి పెరిగి కెనడాలో అదరగొడుతున్నాడు మన తెలుగింటి కుర్రోడు గిరిధర్ నాయక్. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లో చదువుకున్న గిరిధర్ నాయక్.. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అయితే ఇక్కడ ఇష్టంగా నేర్చుకున్న డాన్స్‌ను వదిలేయలేక.. అక్కడ కూడా ప్రాక్టీస్ మొదలెట్టాడు. సరదాగా మొదలైన ఈ ప్రయాణం కాస్తా.. అతని జీవితాన్ని మలుపు తిప్పేలా చేసింది.
కొన్నాళ్ల కింద కెనడాలో డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన నాయక్‌కు ఊహించని స్పందన వచ్చింది. డాన్స్ భిన్నంగా ఉండడం, ఉత్సాహంగా సాగడంతో చాలా మంది అమ్మాయిలకు ఇప్పుడు నాయక్ ఇన్‌స్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అచ్చమైన తెలుగు పాటలకు నాయక్ నేర్పించే స్పెప్పులతో ఊపేస్తున్నారు కెనడా అమ్మాయిలు.
ఇప్పుడు గిరిధర్ నాయక్ ఎంతగా ఫేమస్ అయ్యాడంటే.. అమెరికా, కెనడా దేశాల్లో ఏ పెద్ద ఈవెంట్ ఉన్నా.. ఆర్గనైజర్లు నాయక్‌కు ఫోన్ చేయాల్సిందే. ముఖ్యంగా తెలుగు ఈవెంట్లలో తప్పనిసరిగా కనిపిస్తారు నాయక్. ఆయన వెంట ఇంగ్లీషు అమ్మాయిలు మన తెలుగు షోలలో సందడి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment