సాక్షి, విజయవాడ: ఏపీలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రూ.6.4కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారం భారీగా పట్టుబడింది. ఓ కారులో రూ.6.4 కోట్ల విలువైన 11.1 కిలోల బంగారం, రూ.1.5 లక్షల విదేశీ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీలంక, దుబాయ్ దేశాల నుంచి బంగారాన్ని తీసుకువచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.
శుక్రవారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న ఓ కారులో తరలిస్తున్న 4.3 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు అభరణాలు, రూ.1.5 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని విశాఖలోని కోర్టులో హాజరు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి..
Comments
Please login to add a commentAdd a comment