శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 350 గ్రాముల బంగారం బయటపడింది.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 350 గ్రాముల బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ మహిళ, బంగారాన్ని తన శరీర భాగాల్లో దాచుకొని తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.