
పౌల్ట్రీ వాహనం బోల్తా..
- డ్రైవర్ పరిస్థితి విషమం
మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా)
మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఔటర్‌రింగు రోడ్డుపై కోడిగుడ్లతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి అంబర్‌పేట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి.