శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 650 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఈ బంగారం పట్టుబడింది. నిన్న ఓ ప్రయాణికుడి నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు అధికారులు పట్టుకుంటున్నా, మరోవైపు ప్రయాణికులు మాత్రం అక్రమంగా బంగారాన్ని తరలించటం విశేషం.