హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 2.3 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఈ బంగారం పట్టుబడింది. ఓవైపు అధికారులు బంగారాన్ని పట్టుకుంటున్నా, మరోవైపు ప్రయాణికులు మాత్రం అక్రమంగా పసిడిని తరలించటం విశేషం.
శంషాబాద్లో 2.3 కేజీల బంగారం పట్టివేత
Published Mon, Sep 29 2014 9:44 AM | Last Updated on Thu, Aug 2 2018 4:05 PM
Advertisement
Advertisement