కర్ణాటకలో ఐటీ దాడులు.. 10 కోట్లు స్వాధీనం | I-T department seizes Rs 4 crore and gold seized | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఐటీ దాడులు.. 10 కోట్లు స్వాధీనం

Published Sat, Apr 28 2018 1:50 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

I-T department seizes Rs 4 crore and gold seized - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు, దావ ణగెరే, మైసూర్‌లలోని  కాంట్రాక్టర్ల ఇళల్లో జరిపిన సోదాల్లోరూ.4.01కోట్ల నగదు, 6.5 కిలోల నగలు లభ్యమైనట్లు ఐటీ శాఖ తెలిపింది. ఓ బ్యాంకులోని బినామీ లాకర్‌లో దాచి ఉంచిన రూ.6.76 కోట్ల నగదును గుర్తించింది.

దీంతో గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో సుమారు రూ.20.14 కోట్ల నగదు పట్టుబడినట్లయింది.మరోవైపు, శుక్రవారం దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్‌పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో 58 కేజీల బంగారం పట్టుబడింది. ఫారూక్‌ జైన్‌ అనే వ్యక్తి దేవనహళ్లి నుంచి హొసకోట వైపు బొలెరోలో వెళ్తుండగా, పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఈ బంగారం బయటపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement